శ్రీకాకుళం

అరకు ఎమ్మెల్యే మృతికి మంత్రులు సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 23: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి పట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని సత్యన్నారాయణ, రవాణాశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు తమ సంతాపాన్ని తెలియజేశారు. జిల్లా టీడీపీ సమన్వయ కమీటీ సమావేశం గౌతు శిరీష అధ్యక్షతన ఆదివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగింది. ఈసమావేశంలో జిల్లా టీడీపీ నేతలు మావోయిష్టుల దాడిలో కిడారి ఎమ్మెల్యే మృతి చెందడం పట్ల సంతాపం తెలియజేస్తూ సభను ముగించారు. ఈసంతాప సభలో జడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ప్రభుత్వ విప్ కూనరవికుమార్, పాలిట్‌బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర శివాజీ, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి, పాలకొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, టీడీపీ జిల్లా పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జి, జోగిరాజు వౌళి, మొదలవలస రమేష్, కలిశెల్టి అప్పలనాయుడు, సాధు చిన్ని కృష్ణమనాయుడు, కర్నేని అప్పలనాయుడు, పొందల కృష్ణారావు, పీరుకట్ల విఠల్, కావలి గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు
రాజాం, సెప్టెంబర్ 23: కొంతమంది హింసోన్మాధులు ప్రజాస్వామ్య వ్యవస్థను అవహేళన చేస్తున్నారని, ఇందులో భాగమే సర్వేశ్వరరావు, సోము హత్యలని రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు అన్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. జనజీవన స్రవంతిలో కలవాల్సిన తీవ్రవాదులు హింసకు మద్దతు పలకడం దారుణమైన చర్య అన్నారు. గిరిజన ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు ఇదొక కొత్త ఎత్తుగడ అని ఆయన అభివర్ణించారు. ఏది ఏమైనా సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యూయార్క్ నుంచి సంతాపం తెలిపినట్టు వివరించారు. ఇప్పటికే జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఇన్‌చార్జి మంత్రి, హోమ్‌మంత్రి చినరాజప్ప విశాఖపట్నం చేరుకొని ఈ సంఘటనపై సమీక్షిస్తున్నారని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా పోలీస్, ఐ ఏ ఎస్ ఇతర అధికారులతో సమీక్షిస్తున్నారన్నారు.

సొంత ఎజెండాతో సిద్దమవుతున్న కోండ్రు
రాజాం, సెప్టెంబర్ 23: తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ తన సొంత ఎజెండాను రూపకల్పన చేసి రాజాంను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు ఆయన అభిమానులు, కార్యకర్తలు చెబుతున్నారు. 2009లో రాజాం ఎస్సీ నియోజకవర్గం నుంచి ఉత్తరాంధ్రాలోనే అత్యధిక మెజర్టీ సాధించిన నాయకునిగా గుర్తింపు పొందిన కోండ్రు విప్, మంత్రి పదవులు చేసి రూ.500 కోట్లు నిధులు ఈ నియోజకవర్గానికి వెచ్చించి తాగునీరు, సాగునీరు, ఆరోగ్యం, విద్య, రహదారులు, రోడ్లు నిర్మాణాలు చేపట్టారు. 2014లో సమైక్య ఉద్యమం దెబ్బకు డిపాజిట్ కోల్పోయిన కోండ్రు చాలా రోజులు వౌనం పాటించి టీడీపీలో చేరిన తర్వాత గ్రూప్‌లన్నింటినీ ఏకం చేసి తనకంటూ ఒక రికార్డు సృష్టిస్తున్నారు. ప్రతిభాభారతి వర్గీయులుగా ముద్ర పడ్డ పది మంది నాయకులు, కార్యకర్తలు కూడా శనివారం కోండ్రును కలిసి తమ మద్దతు తెలపడం విశేషం. రాజాంకు రింగురోడ్డు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, విజయనగరం నుంచి హడ్డుబంగి వరకు నాలుగు వరసల రోడ్డుతో పాటు రాజాం వంద పడకల ఆసుపత్రిని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఏజెండాగా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తుంది.