శ్రీకాకుళం

కళా వర్సెస్ శీరిషా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: జిల్లాలో తెలుగుదేశం పార్టీలో గల అందరూ సీనియర్లు కావడం వల్ల ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూపి ఒకరిపై మరోకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటూ సి.ఎం.కు తలనొప్పి తెప్పించేలా లొల్లికి దిగుతున్నారు. గడచిన సమన్వయ కమిటీలో పోలిట్ బ్యూరో సభ్యురాలు ప్రతిభాభారతి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావుపై ఇన్‌ఛార్జి మంత్రి పితాని సత్యన్నారాయణకు ఫిర్యాదు చేయడం సంచలనమైన చర్చకు దారితీసింది. ఆదివారం ఇక్కడ ఆర్ అండ్ బి వసతి గృహంలో ఇన్‌ఛార్జి మంత్రి పితాని ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శీరిషా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ప్రోటోకాల్ పాటించలేదని సి.ఎం. దృష్టికి తీసుకువెళ్ళాలని ఫిర్యాదు చేయడం మరోసారి జిల్లా టీడీపీ నేతల మధ్య సమన్వయలోపం కన్పించింది. ఈ నెల 17వ తేదీన జలసిరి హారతి కార్యక్రమానికి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఆహ్వానించినవారి జాబితాలో తన పేరు లేదని పోలీసు అధికారులు చెప్పడంతో మనస్తాపానికి గురైనట్టు ఈ సమావేశంలో మంత్రి పితాని వద్ద శీరిషా గోడు వినిపించారు. ప్రోటోకాల్ పాటించాల్సిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తన సొంత నియోజకవర్గంలో వేదికపైకి జిల్లా పార్టీ అధ్యక్షురాలు హోదాలో తనకు ఆహ్వాన జాబితాలో చోటు కల్పించకుండా కుటుంబ సభ్యుల పేర్లే నమోదు చేయించి, అవమానించడం ఎంతవరకూ సమంజషమని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సి.ఎం. దృష్టికి తీసుకువెళ్ళాలని పట్టుబట్టారు. శీరిషాకు సీనియర్ ఎమ్మెల్యే శివాజీ, జిల్లా పార్టీ సమన్వయ కార్యదర్శి మొదలవలస రమేష్‌తోపాటు అనేక మంది సంఘీభావం తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై మంత్రి పితాని స్పందిస్తూ ప్రోటోకాల్ పాటించకపోవడం, జిల్లా టీడీపీ అధ్యక్షురాలను అవమానించడం వంటి సంఘటనలు పార్టీలో మంచి సంకేతాలు ఇచ్చేవి కాదని, ఇటువంటి సంఘటనను సి.ఎం. దృష్టికి తీసుకువెళ్తానని, పునరావృతం కాకుండా చూస్తానంటూ భరోసా ఇచ్చారు. దీంతో కళాపై మండిపడిన శీరిషా వివాదానికి ప్రస్తుతం తెరపడింది.
ఇదిలా ఉండగా, ఈ సమావేశంలో సభ్యులంతా నియోజకవర్గాలవారీగా సి.ఎం. యువనేస్తం పథకాన్ని ఈ నెల 30వ తేదీలోగా అర్హులు ఎన్‌రోల్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులకు ఓటు హక్కు కల్పించడంతోపాటు పోలింగ్ స్టేషన్ పరిధిలో టీడీపీ కేడర్‌ని ఎన్నికల్లో భాగస్వామ్యం చేసేలా అప్రమత్తం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ బూత్ కమిటీ సభ్యులు టీడీపీ శిక్షణా శిబిరాలకు వెళ్ళనివారిని గుర్తించి శిక్షణలో భాగస్వామ్యులు అయ్యేలాచూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష నిర్వహిస్తుండగా, అరుకు ఎమ్మెల్యే కిడారితోపాటు, మాజీ ఎమ్మెల్యే సోమిలపై మావోలు కాల్పులు జరిపి, ప్రాణలుతీయడం వంటి దుశ్చర్య సమాచారం అందిన వెంటనే జిల్లా టీడీపీ సమన్వయకమిటీ సమావేశాన్ని అర్థాంతంగా నిలిపివేసారు. ఈ సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జెడ్పీ ఛైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, గౌతు శ్యామసుందరశివాజీ, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి, పాలకొండ ఇన్‌ఛార్జి నిమ్మక జయరాజ్, చౌదరి బాబ్జీ, పొందల కృష్ణారావు, కర్నేని అప్పలనాయుడు, మొదలవలస రమేష్, పీరుకట్ల విఠల్, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, జోగిరాజు వౌళి, సాధు చిన్నకృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు.