తూర్పుగోదావరి

డెంగ్యూపై అప్రమత్తంగా ఉండండి కలెక్టర్ కార్తికేయ మిశ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 24: డెంగ్యూ జ్వరం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నందున నివారణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. వ్యాధి నిరోధక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం మీకోసం, ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా, సంయుక్త కలెక్టర్ ఏ మల్లిఖార్జున తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ వారం 249 అర్జీలందగా ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, సీజనల్ జ్వరాలపై అప్రమత్తం కావాలన్నారు. గ్రీవెన్స్‌లో అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించి, నిర్ణీత సమయానికే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అర్జీలను కలెక్టర్ పరిశీలిస్తూ ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని బాధితులకు హామీనిచ్చారు. ఈనెల 6న జిల్లాలోని శంఖవరంలో జరిగిన సజీవ దహనం కేసుకు సంబంధించి బాధిత కుటుంబాల్లో ఇద్దరికి ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. గృహ నిర్మాణం కింద బాధిత కుటుంబాలకు గృహాలను మంజూరు చేయాలని గృహనిర్మాణ శాఖ పీడీని ఆదేశించారు. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో మంజూరియా పర్వతాన్ని అధిరోహించిన జిల్లాకు చెందిన విద్యార్థులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. జిల్లాలోని గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బి అర్జునుడు, కరప మండలం విజయరాడుపాలెం గ్రామానికి చెందిన కే ప్రదీప్‌లు జిల్లా నుండి ఎంపికై 20రోజుల శిక్షణ అనంతరం టాంజానియా వెళ్ళి మంజూరియా పర్వతాన్ని అధిరోహించడం ఆనందంగా ఉందన్నారు.
భూ సమస్యలకు పరిష్కారం
భూ సంబంధమైన సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని జేసీ ఏ మల్లిఖార్జున చెప్పారు. గ్రీవెన్స్‌లో భూ సమస్యలపై అందిన అర్జీలను ఆయన విచారించారు. భారత నౌకాదళంలో పనిచేసి పదవీ విరమణ చేసిన పెద్దాపురానికి చెందిన ఎం లక్ష్మీనారాయణ జేసీని కలసి ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాలో తనకు భూమి కేటాయించాలని కోరారు. ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటాలో భూమి కోసం చేసుకున్న దరఖాస్తును పరిశీలించాలని సంబంధిత శాఖాధికారిని జేసీ ఆదేశించారు. ప్రజావాణిలో సంయుక్త కలెక్టర్-2 సీహెచ్ సత్తిబాబు, డీఆర్వో ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.