జాతీయ వార్తలు

పాక్‌లో అరెస్టయిన వ్యక్తికి ప్రభుత్వంతో సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్టు చేసిన భారతీయుడు వాస్తవానికి నౌకాదళానికి చెందిన మాజీ అధికారి అని, ప్రభుత్వంతో అతనికి ఎలాంటి సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలేను పిలిపించి దీనిపై తీవ్ర నిరసన తెలియజేసిన తర్వాత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఒక ప్రకటనలో ఈ విషయం స్పష్టం చేశారు. భారత నౌకాదళంనుంచి గడువుకన్నా ముందే రిటైరయినప్పటినుంచి ఆ వ్యక్తితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఏ దేవ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలన్న ఆసక్తి భారత్‌కు లేదని, పాక్ సుస్థిరత, శాంతి ఈ ప్రాంతంలోని అన్ని దేశాల ప్రయోజనాలకు ముఖ్యమని బలంగా నమ్ముతోందని స్వరూప్ ఆ ప్రకటనలో తెలిపారు. కాగా, కాన్సులేట్ అధికారులు ఆ వ్యక్తిని కలుసుకోవడానికి అనుమతించాలని భారత్ కోరినట్లు కూడా ఆయన చెప్పారు. భారత గూఢచార సంస్థ ‘రా’ అధికారి ఒకరు పాక్‌లోకి క్రమంగా ప్రవేశించి, బలూచిస్థాన్, కరాచీలలో విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడ్డంపై పాకిస్తాన్ తన తీవ్ర నిరసనను, ఆందోళనను భారత్‌కు తెలియజేసినట్లు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఆ భారతీయ అధికారిని కుల్ యాదవ్ భూషణ్‌గా గుర్తించినట్లు బలూచిస్థాన్ హోమ్ మంత్రి మిర్ సర్ఫరాజ్ బుగ్తి చెప్పారు.