శ్రీకాకుళం

తిత్లీ బాధితులను అన్యాయం చేస్తున్న టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, నవంబర్ 9: తిత్లీ తుపాన్ ప్రభావంతో సర్వం కోల్పోయిన నిరాశ్రయులైన బాధితులకు టీడీపీ ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమై అన్యాయం చేస్తున్నారని వైపీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఉద్దానం దున్నూరు పంచాయతీ గ్రామాల్లో పర్యటించారు. పలువురు తుపాన్ బాధితులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిత్లీ తుపాన్ బాధితులకు నష్టపరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయని, టీడీపీ కార్యకర్తలకు నష్టపరిహారం అందే విధంగా అధికారులు, టీడీపీ నాయకులు జాబితాను తయారుచేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు. ప్రజలు టీడీపీ పాలకులు చేస్తున్న అవినీతిని వ్యతిరేకించాలన్నారు. బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజలపక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మెట్ట కుమారస్వామి, జుత్తు నీలకంఠం, డి.గురుమూర్తి, సూర్యనారాయణ, ఆనందరావు, వై.కృష్ణమోహన్, బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో సేవాభావంతోనే ఉజ్వల భవిష్యత్తు
మందస, నవంబర్ 9:విద్యార్థుల్లో సేవాభావంతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుందని ఎన్ ఎస్ ఎస్ జిల్లా అధికారి చింతాడ శరత్‌బాబు, ఎం ఇవో శ్రీనివాసరావులు అన్నారు. శుక్రవారం ఉమాగిరి, జిల్లుండ గ్రామాల్లో శాతావాహన డిగ్రీ,జూనియర్‌కాలేజిల ఆధ్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ సేవాశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో విద్యార్థులు మొక్కలు నాటడం, అక్షరాస్యత, స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి విద్యావంతులుగా తీర్చిదిద్దేతే గ్రామాలు ఆదర్శవంతమైన గ్రామాలుగా అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు నాగభూషణం, ప్రకాశరావు, ఎన్ ఎస్ ఎస్ పివోలు త్రినాధరావు, దుదిష్టినాయుడు, కె.అప్పలమ్మ, ఎస్.బాబ్జీ, బి.కామేశ్వరరావు, మాధవరావు, కె.లక్ష్మినారాయణ, కోదండు, బి.శివ పాల్గొన్నారు.

జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన డిప్యూటీ డీ ఈవో
వంగర, నవంబర్ 9: మండల కేంద్రంలో ఉన్న వంగర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం రాష్ట్రీయ మాధ్యమిక సర్వశిక్షా అభియాన్ డిప్యూటీ డీ ఈవో ఆర్.విజయకుమారి సందర్శించారు. ప్రభుత్వం పాఠశాలకు మంజూరు చేసిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను పరిశీలించారు. అలాగే పాఠశాల స్థితిగతులు, విద్యార్థులకు అందుతున్న వౌళిక సౌకర్యాలు తదితర అంశాలపై హెచ్ ఎం వెంకటరావును అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ, ప్రహరీగోడ పరిశీలించారు. ఆమెతో పాటు ఆర్ ఎం ఎస్ ఏ సహాయకులు శాంతారావు, ఎం ఈవో వై.దుర్గారావు, ఉపాధ్యాయులున్నారు.

వెనె్నలవలస పాఠశాలను సందర్శించిన సీ ఎంవో
సరుబుజ్జిలి, నవంబర్ 9: మండలంలోని వెనె్నలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం సి ఎంవో సి.హెచ్.నల్లయ్య సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ఆరోగ్యం, డిజిటల్ తరగతుల నిర్వహణ, ల్యాబ్, లైబ్రేరీ తదితర సౌకర్యాలు పరిశీలించారు. నెలనెలా వెనె్నల కార్యక్రమంపై ఆరా తీశారు. ఈ సందర్శనలో ఆయనతో పాటు జీ ఎల్‌డీవో సి.హెచ్.జ్యోతి, ఎస్‌వీ ఎస్ కో- ఆర్డినేటర్ కామేశ్వరరావు ఉన్నారు.

బిళ్లాణి కుటుంబాన్ని పరామర్శించిన కోండ్రు
రేగిడి, నవంబర్ 9: మండలంలోని బాలికాయివలస గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త బిళ్లాని చిన్నయ్య ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని శుక్రవారం మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ పరామర్శించారు. అలాగే మునకలవలస గ్రామానికి చెందిన వావిలపల్లి భుజంగరావుఅనారోగ్యంతో బాధపడడంతో అతనిని కూడా పరామర్శించారు. కోండ్రుతో పాటు డీసీసీబీ ఉపాధ్యక్షులు ధర్మారావు, వెంకటప్పలనాయుడు, కడగల నాగరాజు, జగన్మోహన్‌రావు తదితరులున్నారు.

సమస్యలు విన్నవిస్తే పరిష్కరిస్తాం
రేగిడి, నవంబర్ 9: గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులకు విన్నవిస్తే తక్షణమే పరిష్కరిస్తామని ఎంపీడీవో శంకరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఒప్పంగి గ్రామదర్శినిలో పాల్గొని మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందని, అధికారులు చర్యలు తీసుకొని శుభ్రం చేయించాలన్నారు. గ్రామంలోని పాఠశాల, రేషన్ డిపో, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.