శ్రీకాకుళం

స్వయంభువేశ్వర స్వామికి విద్యుత్ వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, నవంబర్ 9: మండల కేంద్రం జలుమూరు వంశధార ప్రధాన కాలువ ఎడమ భాగంన ఉన్న పురాతన దేవాలయం, శతాబ్ధాల చరిత్ర కల్గిన స్వయంభువేశ్వర ఆలయానికి ఎట్టకేలకు విద్యుత్ వెలుగులు ప్రసాదించారు. జేటీ రోడ్‌నుండి సుమారు అర కిలోమీటరు దూరంలో పంట పొలాల్లో ఉన్న ఈ ఆలయానికి గ్రామస్థులు కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కృషి మేరకు శాశ్వత విద్యుత్ ఏర్పాటు చేశారు. రాజకీయాలకతీతంగా ఎన్నో ప్రభుత్వాలు, పార్టీలు మారినా ఇటువంటి పవిత్ర ఆలయానికి ఇంతవరకు విద్యుత్ లేకపోవడం గమనించిన ఆయన అక్కడ ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవుడు సృష్టించిన బొమ్మలైన మనం దేవుని కోసం విద్యుత్ ఏర్పాటు చేయడం తనకెంతో ఆనందదాయకంగా ఉందని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఇది భగవంతుడు నాకిచ్చిన మంచి అవకాశం అన్నారు.

కోటి రూపాయలతో గిరిజన గ్రామాలకు రహదారులు
జలుమూరు, నవంబర్ 9: మండలం మర్రివలస పంచాయతీ జెమినివలస నుండి మాకివలస వరకు సిసి రోడ్డు ఏర్పాటు చేయుటకు రూ.1.50కోట్లు మంజూరైందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సిమెంట్ రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో అతిమారుమూల గిరిజన గ్రామాలుగా గుర్తింపు పొందిన జెమినివలస మాకివలసకు పక్కారోడ్డు నిర్మించడం తమ అదృష్టమని అన్నారు. మర్రివలస పంచాయతీలో తాను జన్మించి ఎమ్మెల్యేగా ఉన్నందున కనీస వౌళిక సదుపాయాలు కల్పన ద్యేయంగా ఈ గ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాసనసభ్యునిగా ఎన్నికైన నాటినుండి నేటివరకు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో పక్కారహదారుల నిర్మాణాలు జరిగాయని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో రోడ్డులేని గ్రామం లేదని ఎక్కడో ఒకటోరెండో మిగిలుంటే తమ పదవీ కాలం పూర్తయ్యేలోగా వాటిని నిర్మిస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, ఏ ఎంసి అధ్యక్షులు వెలమల చంద్రభూషణ, మండల జన్మభూమి కన్వీనర్ బగ్గు గోవిందరావు, పంచిరెడ్డి రామచంద్రరావు, తర్ర బలరాం, పొన్నాడ దాలయ్య పలువురు పాల్గొన్నారు.
సబ్సిడీపై వరి కోత యంత్రం:
మండలం గొటివాడ గ్రామానికి చెందిన మొయ్య రాములు అనే రైతు కుటుంబానికి రూ.22.50లక్షలు విలువగల వరికోత యంత్రాన్ని వారికి అందజేశారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రాయితీపై యంత్రాన్ని అందజేసిందని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. రైతులకు అనేక ఆధునిక పనిముట్లు సబ్సిడీపై అందజేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. గతంలో పురాతన సాగు పనిముట్లతో వ్యవసాయ సాగు కోసం రైతులు అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారని, శాస్ర్తియ పద్ధతిలో సాగు చేసేందుకు రైతుకు అన్ని విధాల తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం చూసిన ఘనత చంద్రబాబునాయుడుదేనని అన్నారు.

నత్తనడకగా పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి పనులు
* రెండేళ్లు గడుస్తున్న పూర్తికాని మరమ్మతులు
* రూ.40 లక్షల వృధా
పలాస, నవంబర్ 9: పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు 40 లక్షల రూపాయలు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి కొద్ది రోజులు తర్వాత టెండర్లు ఖరారు పూర్తియి పనులు ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా నేటికి పనులు పూర్తికాకపోవడం రోగులు పడుతున్న ఇక్కట్లు వర్ణానాతీతం. 50 పడకల ఆసుపత్రిని నిర్మించి ఏన్నో ఏళ్లు గడుస్తుండడంతో వర్షానికి నీరు కారడం, బాత్రూమ్‌లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం, మంచినీటి వ్యవస్థ దెబ్బతినడం వంటివి విషయాలను అప్పట్లో ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి అక్కడికక్కడే 40 లక్షల రూపాయలను మరమ్మతులు కోసం ప్రకటించారు. గుత్తేదారులు నిర్లక్ష్యంతో నత్తనడకన పనులు చేస్తుండడంతో సుమారు రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా గాలి కృష్ణారావు పదవిబాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికి పనుల్లో కదలికలు లేకపోవడంతో ఆయన సహితం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా గుత్తేదారులు సకాలంలో పనులు పూర్తిచేయకపోవడంతో ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు మంచిపేరు రావడం లేదని పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు వాపోయారు. తాను గుత్తేదారుడును పనులు వేగవంతంగా చేయాలని కోరినప్పటికి పనులు గూర్చి చెప్పాల్సిన అవసరం లేదని గుత్తేదారుడు అన్నట్లు వాపోయారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకాశ్‌వర్మ మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని తాము ఎన్నోసార్లు గుత్తేదారుడుకు అడగడం జరిగిందని, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సైతం అడిగినప్పటికి పనుల్లో వేగం కనిపించలేదన్నారు. ఈ విషయమై గుత్తేదారుడు నవీన్‌ను ఫోన్‌లో సంప్రదించగా అభివృద్ధి పనులపై పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌కు చెప్పాల్సిన అవసరం లేదని, పనులను మరో 15 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.