జాతీయ వార్తలు

ఎస్‌ఎస్‌సి, సిబిఎస్‌ఇ సిలబస్‌ల సమన్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి * వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

న్యూఢిల్లీ, నవంబర్ 30: రాష్ట్రాలలోని ఎస్‌ఎస్‌సి బోర్డుల పాఠ్యాంశాలు, సిబిఎస్‌సి బోర్డు పాఠ్యాంశాల మధ్య సమన్వయం సాధించేందుకు కృషి జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ మేరకు చేసిన మార్పులు అమల్లోకి వస్తాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. మంత్రి సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దక్షిణ ముంబయి ఎంపీ అరవింద్ సావంత్ అడిగిన ఒక అనుబంధ ప్రశ్నకు బదులిస్తూ ఎస్‌ఎస్‌సి బోర్డులు, సిబిఎస్‌సి పాఠ్యాంశాల మధ్య సమన్వయం సాధించేందు చర్యలు చేపట్టామన్నారు. ఇటీవల ఢిల్లీలో సిబిఎస్‌సి బోర్డు, రాష్ట్రాల బోర్డు అధికారులతో ఒక సమావేశం నిర్వహించామని, వివిధ ఆంశాలపై చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. దేశంలో ప్రాథమిక విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి తనకు మంచి అవగాహన ఉన్నదని ఆమె చెప్పారు. అరవింద్ సావంత్ మాట్లాడుతూ ప్రాథమిక విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల బోర్డులు నిర్ధారించిన పాఠ్యాంశాలు, సిబిఎస్‌సి పాఠ్యాంశాల మధ్య ఉన్న వ్యత్యాసాల మూలంగా విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని సావంత్ వివరించారు. ప్రాథమిక విద్యలో విద్యార్థులందరికీ ఒకే రకమైన పాఠ్యాంశాలు ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుత విద్యా విధానం మూలంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు వివక్షకు గురవుతున్నారని సావంత్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షతను తొలగించాలంటే రాష్ట్ర బోర్డులు, సిబిఎస్‌సి పాఠ్యాంశాలు ఒకే రకంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి సభ్యుడి డిమాండ్‌కు సానుకూలంగా స్పందించారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు సంబంధించిన అన్ని ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను ఇ-పాఠశాలలో పొందుపరిచామన్నారు. ఇవి హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఆన్‌లైన్‌లో ఉచితంగా లభిస్తాయని మంత్రి తెలిపారు. మొబైల్ యాప్‌లో కూడా వీటిని పొందుపరిచినట్లు చెప్పారు.