జాతీయ వార్తలు

రాహుల్‌కు మోదీ ఫోబియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్వాని (ఎంపీ), నవంబర్ 15: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మోదీ ఫోబియాతో బాధపడుతున్నారని, అందుకే ఆయన చేసే ఎన్నికల ప్రసంగాల్లో ఆయన పార్టీ నేతల గురించి చెప్పడం మర్చిపోయి నిత్యం మోదీ.. మోదీ అంటూ జపం చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. రాహుల్ ప్రసంగాలతో అసలు తాము కాంగ్రెస్ సభకు వచ్చామో, బీజేపీ సభకు వచ్చామో తెలియక ప్రజలు గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉన్న బర్వానిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను రాహుల్ సభకు సంబంధించిన ఆడియో విన్నానని, అందులో ఆయన తాను ప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం మాని మోదీ గురించి ఎక్కువగా మాట్లాడారని అన్నారు. గిరిజనుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని షా ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని, కాని తాము ఇండోర్-మన్మాడ్ రైలు మార్గాన్ని మంజూరు చేశామని చెప్పారు. ప్రధానిగా అయిన తర్వాత ఇక్కడ మోదీ చేసిన ప్రసంగంలో తమ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అయితే గిరిజనుల కోసం ఒక ప్రత్యేక శాఖనే ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌దేశాయ్ దేశంలోని సహజ సంపదపై మైనారిటీలకు హక్కు ఉంటుందని అన్నారని, కాని ప్రధాని మోదీ మాఅతం గిరిజనులు, పేదలకు దేశంలోని సహజసందపపై పూర్తిగా హక్కు ఉంటుందని ప్రకటించారని షా తెలిపారు. అదీ కాంగ్రెస్‌కు, తమకు తేడా అని అన్నారు. పేద, గిరిజన మహిళలకు మోదీ ప్రభుత్వం 5.5 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం 129 సంక్షేమ పథకాలను నిర్వహిస్తోందని, అందులో ఫారెస్టు రైట్స్ యాక్టు కింద గిరిజనులకు భూమి ఇవ్వడం ఒకటని ఆయన చెప్పారు.
మోదీ ప్రభుత్వం ఏమి చేసిందని రాహుల్ బాబా ఈ నాలుగున్నరేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారని, దానికి ముందు 60 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ దేశానికి ఏమి చేసిందో చెప్పాలని షా డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగ్విజయ్ సింగ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో రోడ్లు కాని, విద్యుత్ సౌకర్యం కాని లేని విషయాన్ని పేర్కొంటూ ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అనూహ్య అభివృద్ధిని సాధించిన విషయాన్ని షా గుర్తు చేశారు.