శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కరవు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 16 : జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని, ఇందుకోసం అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అనీల్‌చంద్ర పునేఠ అన్నారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నెల్లూరుకు రాగా జిల్లా కలెక్టరు ఆర్ ముత్యాలరాజు, జిల్లా పోలీసు అధికారి ఐశ్వర్య రస్తోగి, సంయుక్త కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం ముఖ్యకార్యదర్శి, కలెక్టర్, ఎస్‌పీ, సంయుక్త కలెక్టరు, జిల్లా అధికారులతో కలెక్టరు క్యాంపు కార్యాలయంలో సమావేశమై జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులను, తాగునీటి సమస్యలు, ఉపాధి పనులు, పశుగ్రాసం, అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, పేదలకు జీవనోపాధులు, విద్యాభివృద్ధి, శాంతి భద్రతలు, తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకొని సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో కరవు తీవ్రంగా ఉందని, 46 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని ముఖ్య కార్యదర్శికి వివరించారు. గత సంవత్సరం 24 శాతం లోటు వర్షపాతం ఉంటే, ఈ సంవత్సరం 67 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. కరవు దృష్ట్యా గుర్తించిన 369 ఆవాస ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను అధిగమించేందుకు రూ.9.54 కోట్లతో కరవు నివారణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అందులో అక్టోబర్ 2018 వరకు రూ.6.51 కోట్లు అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు జిల్లాకు నాన్ సిఆర్‌ఎఫ్ కింద రూ.2 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఇంకా రూ.7.5 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యకార్యదర్శిని కోరారు. జిల్లాలో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, జిల్లాలో రూ.11.55 లక్షలు పశువులు ఉన్నాయని, 10.40 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం కాగా 9.36 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందని, 1.04 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం కొరత ఉందన్నారు. దాన్ని అధిగమించేందుకు రాబోయే ఆరు నెలలకు రూ.16.90 కోట్లు అవసరం ఉందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లా ఎస్‌పి ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, శాంతియుత వాతావరణం నెలకొని ఉందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కావలసిన నిధులను తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో తాగునీటి సమస్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీలలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని వారి బాగోగులను పర్యవేక్షించాలని, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు కృషి చేయాలన్నారు. ఏవైనా ఇంకా సమస్యలు ఉంటే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో తెలుగుగంగ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టరు భార్గవి, ఐసీడీఎస్ పీడీ నాగలక్ష్మి, సీపీవో పిబికె మూర్తి, వ్యవసాయ శాఖ జేడీ చంద్రనాయక్, డిఎఫ్‌ఓ వేణుగోపాల్, ఎఫ్‌ఎస్‌ఓ చినరాముడు, డిఐసి జిఎం శ్రీనివాసరావు, డీఈవో శామ్యూల్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.