హైదరాబాద్

ఆచారణకు సాధ్యం కాని హామీలపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: రానున్న ఎన్నికల్లో ఆచారణ సాధ్యంకాని హామీలు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని మహాన్ భారత్ అభియాన్ వ్యవస్థాపకులు నారాయణ చార్యులు తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ బ్రాండ్ అంబాసిడర్, నిజాం మునిమనవడు రౌనక్ యార్ ఖాన్‌తో కలిసి మాట్లాడుతూ అభ్యర్థులు ఇచ్చే వాగ్దానాలు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ఉండాలని ఉండాలని అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు రూపొందిస్తున్న మెనిఫెస్టోలు, వాగ్దానాలు ఆచారణకు ఆమడ దూరంలో ఉంటున్నాయని అన్నారు. ప్రజలను మభ్యపెట్టేలా వాగ్దానాలు చేసే వారిపై రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఎన్నికల కమిషన్‌కు ఉందని స్పష్టం చేశారు. అభ్యర్ధులు వారి వాగ్దానాలను డిక్లరేషన్ రూపొంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందజేయాల్సి ఉంటుందని, దానిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించబడతాయని చెప్పారు. నిర్ణీత కాలంలో హామీలు పూర్తి చేయకపోతే సదరు అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే లా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ కలిసినట్టు చెప్పారు. ప్రజల్లో కూడా విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. సంస్థ కోఆర్డినేటర్ భారత్ తుక్రాల్, పాత్రికేయులు మహ్మద్ షరీఫ్ పాల్గొన్నారు.