విశాఖ

సబ్బవరం హైస్కూలుకు పూర్వ విద్యార్థుల వితరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, నవంబర్ 19 : స్థానిక ప్రభుత్వ హైస్కూలులో 1997-98 విద్యాసంవత్సరాల్లో టెన్త్‌క్లాసు పూర్వ విద్యార్థులు సోమవారం హెచ్‌ఎం చిన్నమ్మాయికి బీరువాను విరాళంగా అందజేశారు.అయితే ఆదివారం ఇదే విద్యార్థుల బృందం పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించిన సంగతి తెల్సిందే. అయితే ఇక్కడి హైస్కూలుకు బీరువా అవసరముందని గుర్తించిన ఆ విద్యార్థుల బృందం సోమవారం సుమారు 10,500 రూపాయల విలువ చేసే గోద్రేజ్ బీరువాను అందజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు బివి రమణ, పీడీ ఎ.శేఖర్, పూర్వ విద్యార్థుల బృందం పాల్గొన్నారు.

అమృత ఫల రైతుల ఉత్పత్తులకు లాభసాటి ధరలు తధ్యం
సబ్బవరం, నవంబర్ 19 : జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమృతఫల రైతులు పండించే పంటలకు లాభసాటి వ్యాపార ధరలు తప్పక లభిస్తాయని ఆ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కందర్పరామకృష్ణఅన్నారు. అఖిల భారత 65వ సహకార వారోత్సవాల సందర్భంగా ఇక్కడి సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు సంఘాల సభలో ఆయన సోమవారం మాట్లాడారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించటం జరిగిందని ,తద్వారా వారి ఉత్పత్తులకు మంచి గ్రేడింగ్ రావటంతో కూరగాయలు, ఆకుకూరలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. అంతేకాకుండా రైతుల వద్దకే నేరుగా వినియోగదారులు, వ్యాపారులు వచ్చి పంటలు కొనుగోలు చేసే విధంగాను,పట్టణ ప్రాంతాలకు తరలించి సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలను అమ్మకాలు జరిపించటం ద్వారా ఎంతో లాభసాటి వ్యాపార లావాదేవీలకు ఆస్కారం కలుగుతుంద