జాతీయ వార్తలు

హర్యానా అభివృద్ధికి అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, నవంబర్ 19: గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహించడం వల్లే హర్యానా ఎంతో నష్టపోయిందని, ఎన్నో కీలక ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కేపీఎమ్ ఎక్స్‌ప్రెస్ వే కుండ్లీ-మానేసర్ విభాగాన్ని సోమవారం నాడిక్కడ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోదీ హర్యానా అభివృద్ధి చరిత్రలో ఇది చాలా కీలకమైన రోజని అన్నారు.
బల్లభ్‌గఢ్-ముజేసర్ మెట్రో లింక్‌ను కూడా ప్రారంభించిన ప్రధాని విశ్వకర్మ నైపుణ్య విశ్వవిద్యాలయానికీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఈ నేడు తాను చేపట్టిన కార్యక్రమాలతో హర్యానా సమగ్రాభివృద్ధి దిశగా మరోబలమైన అడుగు వేసినట్టయిందన్నారు. కుండ్లీ-మానేసర్ విభాగం ప్రారంభంతో మొత్తం 135 కిలోమీటర్ల కేఎమ్‌పి ప్రాజెక్టు పూర్తయినట్టయిందన్నారు. ఈ ప్రాజెక్టు ఇంత వేగంగా పూర్తికావడానికి కారణం తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేయడమేనని, గత ప్రభుత్వాలకు ఈ పట్టుదల లేకపోవడం వల్లే అనేక హర్యానా ప్రాజెక్టుల్లో జాప్యం జరిగిందని, ఎన్నో అవరోధాలూ ఏర్పడ్డాయని చెప్పారు.నిజానికి ఈ ప్రాజెక్టు పనులు గత పనె్నండేళ్లుగా జరుగుతూనే ఉన్నాయని, అన్నీ అనుకున్నట్టుగా సాగి ఉంటే ఎనిమిదేళ్ల క్రితమే ఇది పూర్తయి ఉండేదన్నారు. అలా జరుగక పోవడానికి కారణం గత ప్రభుత్వాల నిర్లక్ష్యమేనంటూ కాంగ్రెస్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. ఈ జాప్యందారీ ధోరణి వల్ల ఈ ప్రాజెక్టు వ్యయం కూడా 1200కోట్ల రూపాయల నుంచి ఎన్నో రెట్లు పెరిగిపోయిందని, హర్యానా ప్రజలూ ఎంతో నష్టపోయారన్నారు. మెట్రో రైలు లింకు ప్రాజెక్టు వల్ల అనుసంధానతలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, అలాగే స్కిల్ వర్సిటీ వల్ల యువతకూ ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించి తాను వ్యక్తిగతంగా శ్రద్ధ వహించానని, హర్యానా ప్రభుత్వంతో ఎన్నో సమావేశాలూ నిర్వహించానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఇంతకు ముందు కెఎమ్‌పి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రదర్శనను మోదీ సందర్శించారు.

చిత్రం..హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో సోమవారం జరిగిన జనవికాస్ ర్యాలీలో
ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ కత్తర్