శ్రీకాకుళం

ఓటరు జాబితా సరిదిద్దడంలో బి ఎల్‌వోల బాధ్యతే ప్రధానమైనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 12: జిల్లాలో ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడంలో బూత్ స్థాయి అధికారులు జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో శ్రీకాకుళం శాసన సభ నియోజకవర్గ పరిథిలో గల ఓటరు జాబితాలో చేర్పులు, తొలగింపులపై బూత్ స్థాయి అధికారులు, ప్రతినిధులు, గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల జాబితా డ్రాప్ట్ నోట్ 2018 సెప్టెంబర్, జులై నెలలో ముద్రించడం జరిగిందని చెప్పారు. ఈ జాబితాలో మరణించిన వారి పేర్లు, ఒకేసారి రెండుసార్లు వచ్చినవి కూడా చాలా ఉన్నాయన్నారు. వీటన్నింటిని సరిచేయాల్సిన అవసరం వుందని చెప్పారు. బి ఎల్‌వోలు ఎన్నికల కమీషన్ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని అన్నారు. ఓత్తిడిలకు లోబడరాదని చెప్పారు. అట్లా జరిగితే సహించేది లేదని చెప్పారు. ఏస్థాయిలో పొరపాట్లు జరిగినా ఎన్నికల కమీషన్ కఠిన చర్యలు చేపడుతుందన్నారు. డ్రాఫ్ట్‌కాపీని గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇది ప్రజలకు సంబంధించిందని, ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం వారికి చూపించాలని, అవసరమైతే మొదటివారానికి ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల సంబంధిత అధికారులు శాఖాపరమైన లక్ష్యాలు ఉన్నప్పటికి ఎన్నికల జాబితాకు సంబంధించిన పని నిర్ణీత గడువునాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. బూత్ లెవెల్ ఏజెంట్లను పార్టీ నాయకులు ఖరారు చేసి పేర్లను తెలియజేయాలని చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 270 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటన్నింటికి కరెంట్, ఇంటర్‌నెట్, టాయిలెట్స్, ఫర్నీచర్ తదితర వౌళిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫారం 6,7,8ఎలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. ఓటర్ల జాబితా సరిగా లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. జాబితాలో ఓటరు ఫొటో సరిగా కన్పించకపోతే దానిని మార్పించాలని చెప్పారు. ఒక కుటుంబానికి సంబంధించి అన్ని ఓట్లు ఒకే పోలింగ్ బూత్ వద్ద ఉండాలని అన్నారు. డోర్ టు డోర్ సర్వేచేసి ఆ గ్రామం యొక్క ఓటరు జాబితాలో వికలాంగులు ఎంతమంది ఉన్నారో, వి ఐపిలు ఎంతమంది ఉన్నారో మార్కింగ్ చెయ్యాలని అన్నారు. ఆర్డీవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనవరి 1,2019 నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వార్కి ఓటరుగా నమోదు చేసుకునే విధంగా జాయింట్ కలెక్టర్ కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున నమోదు చేయించడం జరిగిందిని చెప్పారు. జాబితాలో ఒకే నెంబరుపై ఇద్దరి పేర్లు, ఒకే పేరు రెండు సార్లు రావడం, డోర్ నెంబర్లు తప్పుపడడం ఉన్నాయని చెప్పారు. వాటన్నింటిని సరిచేయాలని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయినంతవరకు ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ భవానిశంకర్, గార తహశీల్దార్ ఎ.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.