హైదరాబాద్

చితకబాదిన ఫ్రెండ్లీ పోలీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్: బోయిన్‌పల్లిలోని చిన్నతోకట్టలో ఫ్రెండ్ పుట్టిన రోజు వేడుకకు వచ్చిన తొమ్మిది మందిని బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన సంఘటన సంచలనం రేపింది. డిసెంబర్ 18న అర్థరాత్రి జరిగిన ఘటన రెండు రోజుల తర్వాత బయటకు వచ్చింది. పోలీసులు కొట్టిన దెబ్బల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు నగర కమిషనర్ అంజనీ కుమార్ స్పందించి నార్త్ జోన్ డీసీపీని దర్యాప్తు చేసి 24 గంటల లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. యువకులను తీసుకొచ్చి కౌనె్సలింగ్ ఇచ్చి పంపివేశామని సీఐ ఆనంద్ కిషోర్ చెబుప్పుతున్నారు.స్థానికలు, బాధితుల కథనం ప్రకారం బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిథిలోని చిన్న తోకట్ట నివాసి సాయి యాదవ్ పుట్టిన రోజును డిసెంబర్ 18న అర్థరాత్రి అతని మిత్రుల మధ్య జరుపుకుంటున్నారు. అటుగా గస్తీకి పోలీసులు వచ్చి సాయి యాదవ్ మిత్రులతో గొడవకు దిగి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐ ఆనంద్ కిశోర్, ఎస్‌ఐలు శ్రీనివాస్, గురుస్వామి ఇటీవల విధుల్లో చేరిన కానిస్టేబుళ్లతో రెండు రోజుల చిత్రహింసలకు గురిచేయించారు. స్థానిక నేత ప్రోత్బలంతోనే పోలీసులు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మిత్రులు అభిషేక్ నాయుడు, పుష్పరాజ్, కళ్యాణ్, సందీప్ యాదవ్, భానుప్రకాష్, అభిషేక్ యాదవ్, భరత్, మనిష్ కేక్ తీసుకొని సాయి యాదవ్ వద్దకు వచ్చి పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నారు. సాయి యాదవ్ నివాసం ఉన్న ప్రాంతం చిన్నది కావటంలో ఇరుగుపొరుగు ఫిర్యాదు చేశారని పోలీసులు వచ్చి స్టేషన్‌కు తరలించారు. రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి డిసెంబర్ 20న ఉదయం వదిలివేశారని బాధితులు పేర్కొన్నారు. మైనర్లను అదుపులోకి తీసుకుంటే తల్లిదండ్రులను సమక్షంలో కౌనె్సలింగ్ ఇవ్వాలని, అలా కాకుండా చిత్రహింసలు పెట్టడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.
ఫ్రెండ్లీ పోలీసులుగా వ్యవహరించాలని కమిషనర్ ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. సంఘటన నేపథ్యంలో బాధితుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. సీఐ ఆనంద్ కిషోర్ స్పందిస్తు పుట్టిన రోజు వేడుకల పేరుతో బస్తీలో ఇబ్బంది కలిగిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినందుకే అదుపులోకి తీసుకున్నామని, న్యూసెన్స్ కేసు నమోదు చేసి వదిలి పెట్టామని తెలిపారు.