జాతీయ వార్తలు

మరింత సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, ఏప్రిల్ 3: సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్‌తో చర్చలు జరిపారు. వ్యాపారం, పెట్టుబడులు, ఉగ్రవాద నిరోధం సహా వివిధ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పెట్రోలియం నిల్వలు సమృద్ధిగా ఉన్న సౌదీ అరేబియా భారత్‌కు అత్యధికంగా ముడి చమురును సరఫరా చేసే దేశం. మన దేశం దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ దేశంనుంచే దిగుమతి చేసుకుంటోంది. కాగా, ఈ రంగంలో సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి. గత ఏడు నెలల్లో మోదీ గల్ఫ్‌లో పర్యటించడం ఇది రెండోసారి. దాదాపు 80 లక్షల మంది భారతీయలు గల్ఫ్ దేశాల్లో ఉండడమే కాకుండా మన ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకమైనది. గత ఏడాది ఆగస్టులో ప్రధాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించడం తెలిసిందే. సౌదీ రాజుతో చర్చలు జరపడానికి ముందు సౌదీ విదేశాంగ మంత్రి అదెల్ అల్జుబీర్ మోదీతో సమావేశమై పరస్పరం ఆసక్తి కలిగిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆరోగ్య మంత్రి, సౌదీ అరేబియా జాతీయ చమురు కంపెనీ ఆరామ్‌కో అధినేత ఖాలిద్ ఎ అల్ ఫాలి కూడా మోదీని కలిశారు. పెట్టుబడులు పెట్టడానికి భారత్ అత్యంత ముఖ్యమైన దేశంగా ఆరామ్‌కో భావిస్తోందని ఆయన మోదీకి చెప్పారు. అంతకుముందు ప్రధాని దాదాపు 30 మంది సౌదీ, భారతీయ వాణిజ్య సంస్థల సిఈఓలతో సమావేశమై భారత రక్షణ, ఇంధన, రైల్వే, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సౌదీలోని ప్రముఖ కంపెనీల సిఈఓలను ఆహ్వానించారు.

రియాద్‌లో సైనికుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోది.
చిత్రంలో సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్