విశాఖ

ఆదరిస్తే అన్నీ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జనవరి 23: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ఆదరిస్తే గిరిజన ప్రాంత సమగ్రాభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. పాడేరు అంబేద్కర్ కూడలిలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నాం జరిగిన బహిరంగ సభలో గిరిజనులకు పలు హామీలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అపారమైన వనరులు ఎన్నో ఉన్నా ప్రభుత్వం వీటిని గిరిజనుల అభ్యున్నతికి వినియోగించకపోవడంతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయని అన్నారు. తాను గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినపుడు అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని, తాను ఎక్కడికి వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో గంజాయిపై మొగ్గు చూపుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన వాపోయారు. గిరిజన యువతకు ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంతంలో ఎన్నో అవకాశాలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితులలో యువత పెడ దారి పట్టక ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు నెలకు రెండు వేల రూపాయల పించను ఇవ్వడం కాదని, వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. జూనియర్ కళాశాల బాలికలు మరుగుదొడ్లు లేక పడుతున్న అవస్థలు తన దృష్టికి వచ్చాయని, యుక్త వయస్సులో ఉన్న బాలికల పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అంటూ ఆయన నిలదీసారు. పాడేరులో ఐ.టి.డి.ఎ. ఉన్నా గిరిజన యువతకు ఏమాత్రం ఉపయోగం లేదని, వారిని అభివృద్ధి చేసేందుకు ఐ.టి.డి.ఎ. ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో పథకాన్ని సాధించిన గిరిజన యువకుడికి సహాయం చేసేందుకు ఐ.టి.డి.ఎ. నిరాకరించడంతో కరాటేలో తన ఉన్నత భవిష్యత్తును ఆ యువకుడు కోల్పోయాడని ఆయన చెప్పారు.