జాతీయ వార్తలు

సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కుదరని ఏకాభిప్రాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సీబీఐ కొత్త డైరెక్టర్ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీబీఐ డైరెక్టర్‌గా కొత్త అధికారి ఎంపిక కోసం శుక్రవారం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత కమిటీ సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎంపికపై జరిగిన రెండు సమావేశాల్లో కూడా ఉన్నత కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. తాత్కాలిక డైరెక్టర్ పదవిలో అధికారిని ఎక్కువ కాలం కొనసాగనివ్వడానికి సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పులో నిరాకరించింది. వెంటనే రెగ్యులర్ డైరెక్టర్‌ను నియమించాలని కోర్టు ఆదేశించింది. తాత్కాలిక డైరెక్టర్ పదవిలో ఉన్న అధికారిని ఎక్కువ కాలంలో కొనసాగనివ్వరాదని కోర్టు పేర్కొంది. ఇంతవరకు ఈ నియామకం ఎందుకు చేపట్టలేదని కూడా కోర్టు ప్రశ్నించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఉన్నత కమిటీ సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా పడిందని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 10వ తేదీ నుంచి సీబీఐ డైరెక్టర్ పదవి ఖాళీగా ఉంది. డైరెక్టర్ పదవికి అధికారిని ఎంపిక చేసేందుకు గత నెల 24వ తేదీన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం 70 నుంచి 80 మంది అధికారుల పేర్లను కమిటీ ముందుంచిందని, కాని ప్రొఫైల్ లేదని అప్పట్లో ప్రతిపక్ష నేత, కమిటీ సభ్యుడు మల్లికార్జునఖర్గే చెప్పారు.