హైదరాబాద్
పర్యావరణ పరిరక్షణకు కృషి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 February 2019
ఖైరతాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని వర్ధమాన తారలు రకుల్‌ప్రీత్ సింగ్, కార్తీ కోరారు. ఆదివారం నెక్లెస్ రోడ్లో నగర ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సేవ్థాన్ పేరుతో నిర్వహించిన మారథాన్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నానాటికీ పెరుగుతున్న కాలుష్యం జీవరాసులతో పాటు మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న విషయాన్ని విస్మరించరాదని సూచించారు. స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ ఎవరికివారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తోడ్పాటు అందించాలన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోట మొక్కలు నాటి వాటిని పెంచి పెద్దచేయాలని కోరారు. మారథాన్‌లో నగరానికి చెందిన యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.