శ్రీకాకుళం

బీజేపీ అభివృద్ధి మా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఫిబ్రవరి 18: బీజేపీ పార్టీని స్థానికంగా పటిష్టం చేసి అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాధం అన్నారు. సోమవారం పలాస మున్సిపాలిటీలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని అందించి, మేరాపరివార్, భారత్ పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కుటుంబ ఇళ్లుపై బీజేపి వ్యవస్థాప అధ్యక్షుడు దీనదయాల్ ఉపాధ్యాయ స్పూర్తిగా తీసుకొని బీజేపీ జెండాలను ఎగురవేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బీజేపీ కుటుంబ సభ్యులు పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేయాలని, నరేంద్రమోడీ విశాఖకు రానున్నారని, ఆ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నరేంద్రమోడీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా, అభివృద్ధికి నోచుకోలేదని, ఇదంతా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాలవలస వైకుంఠరావు, కె.్భస్కరరావు, కొర్రాయి బాలకృష్ణ, సీరపు జోగారావు, పి.మాధవరావు, కెపి రామన్న, వైకుంఠరావు, పైల రాజరత్నంనాయుడు, మల్లేశ్వరరావు, కంచరాన బుజ్జి, వైశ్యరాజు రాజు తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన
మందస, ఫిబ్రవరి 18: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం తహసీల్థార్ కొండలరావు తాళ్లగురంటి, బుడార్సింగి, పిడి మందస, విజిపురం, సువర్ణపురం, నారాయణపురం, హరిపురం పోలింగ్‌కేంద్రాలను పరిశీలించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాలు వద్ద మరుగుదొడ్లు, విద్యుత్తు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్ వంటివి పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లును పరిశీలించారు. ఈయనతోపాటు ఆర్ ఐలు సునంద, ఢిల్లీరావు, ఎ ఎస్ వో భోగేశ్వరరావు, సర్వేయర్ శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.
పంపిణీ కాని ట్రాలీ రిక్షాలు
మందస, ఫిబ్రవరి 18: మందస మండలంలోని పంచాయతీలకు పంపిణీ చేయాల్సిన ట్రాలీ రిక్షాలు మండల తహసీల్థార్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్నాయి. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలు కోసం ఈ ట్రాలీ రిక్షాలు ప్రభుత్వం సరఫరా చేసినప్పటికి ట్రాలీ రిక్షాలు గ్రామ పంచాయతీల్లోని గ్రామాల్లో చెత్త ఎత్తుకువెళ్లి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలి. రిక్షాలు ఉన్నప్పటికి సరఫరా కాకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి పంచాయతీలకు ట్రాలీ రిక్షాలను సరఫరా చేయాలని ఆ యా పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.
విద్యార్థులను ప్రోత్సాహించడమే జనసేన లక్ష్యం
పలాస, ఫిబ్రవరి 18: విద్యార్థులను ప్రోత్సాహించి విద్యారంగాన్ని బలోపేతం చేయడమే జనసేన లక్ష్యమని జనసేన నాయకులు కోత పూర్ణచంద్రరావు అన్నారు. జనసేన పార్టీ, థర్డ్ ఐ సోసైటీ, ఎన్ ఆర్ ఐ మోదుగులవలస రవి సహకారంతో నియోజకవర్గంలోని పలు ఎలమెంటరీ స్కూళ్లుకు క్రీడాపరికరాలను సోమవారం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సాహించాలనే ధ్యేయంతో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పిలుపు మేరకు జనసేన అనుబంధ సంస్థలు ముందుకు వచ్చాయని, అందులో భాగంగానే విద్యార్థులకు క్రీడాపరికరాలను అందిస్తున్నామని, క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు జనసేన చేయూతను ఇస్తుందని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం వున్న క్రీడాకారులు ఉన్నప్పటికి సరైన అవకాశాలు, వసతులు లేకపోవడంతో వారి నైపుణ్యం మరుగున పడుతుందన్నారు. అనంతరం 14వ వార్డులో 6 లక్షల రూపాయలతో సాధారణ నిధులతో చేపట్టిన సీసీ కాలువ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాతాళ ముకుంద, ఎస్.మోహనరావులతోపాటు బల్ల శ్రీనివాసరావు, కె.కృష్ణారావు, రవి తదితరులు పాల్గొన్నారు.

పలాస ఎంపీడీవోగా విజయలక్ష్మి
పలాస, ఫిబ్రవరి 18: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బదిలీల్లో భాగంగా పలాస ఎంపీడీవోగా కె.విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజయలక్ష్మి గతంలో గుమ్మలక్ష్మిపురం ఎంపీడీవోగా విధులను నిర్వహించేవారు. ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మిని కార్యాలయం సిబ్బంది సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది, ప్రజల సహకారంతో మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. విధుల నిర్వహణలో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని, సిబ్బంది అంతా ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు.