హైదరాబాద్

వావ్..చార్మినార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చారిత్రక కట్టడమైన చార్మినార్‌ను 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా చార్మినార్ చారిత్రక శోభను సందర్శించి సభ్యులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సంఘం చైర్మన్ నంద కిషోర్ సింగ్, సభ్యులు డా. అనూప్‌సింగ్, డాక్టర్ రమేశ్‌చంద్, జాయింట్ డైరెక్టర్ ఆనంద్‌సింగ్ పర్మార్, డిప్యూటీ డైరెక్టర్ నితీష్ సైనీ, అసిస్టెంటు డైరెక్టర్ సందీప్‌కుమార్, డీడీఓ డేకే శర్మ, పీఎస్ త్యాగరాజన్‌లతో కూడిన ఈ బృందం కొద్దిరోజుల క్రితం నగరానికి విచ్చేసిన ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందానికి చార్మినార్ వద్ద జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ స్వాగతం పలికారు. చార్మినార్ నిర్మాణ శైలి, హైదరాబాద్ చరిత్ర, చార్మినార్ పెడస్టేరియన్ ప్రాజెక్టు, మూసీ సుందరీకరణ వంటి ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. కుతుబ్‌షాహీల నిర్మాణ శైలిలో నిర్మించిన చార్మినార్‌ను చూసి ముగ్ధులయ్యారు. సందర్శన అనంతరం చార్మినార్ వద్ద ఇరానీ టీ, బిస్కెట్లను రుచి చూసిన సంఘం ప్రతినిధులు మరువలేని అనుభూతి పొందామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిరక్షణ, చుట్టూ చేపట్టిన అభివృద్ధి పనులు, పెడస్టేరియన్ ప్రాజెక్టుల వివరాలను కమిషనర్ వారికి వివరించారు. సుమారు రూ. 36 కోట్ల వ్యయంతో ఈ పెడస్టేరియన్ ప్రాజెక్టు పనులను చేపట్టామని తెలిపారు. దీంతోపాటు నగర చారిత్రక వైభవానికి ప్రతీకలుగా మిగిలిపోయిన నగరంలోని 12 పురాతన క్లాక్‌టవర్లను కూడా పునరుద్ధరించే పనులు చేపట్టామని వివరించారు. ఆ తర్వాత ఈ బృందం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సందర్శించింది. ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాల్లో ఒకటైన ఈ ప్యాలెస్ చరిత్రను కమిషనర్ వారికి వివరించారు. 1884లో వికార్ ఉల్ ఉమ్రా ఈ ప్యాలెస్‌ను నిర్మించారని, ఫలక్‌నుమా అంటే ఆకాశ స్వర్గం అని అర్థం వస్తుందని పర్యాటక శాఖ అధికారులు బృందానికి తెలిపారు. 32 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్యాలెస్‌ను వికార్ 1897లో 6వ నిజాంకు బహుకరించారని వెల్లడించారు. అనంతరం సంఘం చైర్మన్ ఎన్.కే.సింగ్ చార్మినార్ జ్ఞాపికను బహకరించి, సత్కరించారు. చార్మినార్‌ను సందర్శించిన వారిలో సంఘం ప్రతినిధులతో పాటు టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ శృతి ఓజా, చార్మినార్ పెడేస్టేరియన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.