జాతీయ వార్తలు

మేజర్‌కు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: బంధువులు, మిత్రులు, వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ అంత్యక్రియలు మంగళవారం హరిద్వార్‌లోని గంగానది తీరాన జరిగాయి. సోమవారం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో దౌండియాల్ అమరుడైన విషయం తెలిసిందే. దౌండియాల్‌కు పూర్తి అధికార లాంఛనాలతో ఖర్కారి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపారు. ఈ యువ అధికారి చితికి ఆయన అంకుల్ జగదీష్ దౌండియాల్ నిప్పంటించారు. దౌండియాల్, మామగారు ఇతర బంధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు వివాహం జరిగి సంవత్సరం కూడా కాలేదు. మంత్రి మదన్ కౌశిక్, ముస్సోరి ఎమ్మెల్యే గణేష్ జోషి, పిసిసి ఇన్‌చార్జి అనుగ్రాహ నారరన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామి తదితరులు మృతవీరుడికి నివాళులు అర్పించారు. అంతకుముందు దౌండియాల్ మృతదేహాన్ని జాతీయజెండా కప్పి ఉంచిన శవపేటికలో డెహ్రాడూన్‌లోని నావిసిల్లేరోడ్‌లోని ఆయన గృహానికి ఉదయం తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని చూసి బంధువులు, స్నేహితులు పెద్దపెట్టున రోదించారు. హృద్రోగ వ్యాధిగ్రస్తురాలైన తల్లి సరోజ్, భార్య నిఖితాకౌల్ రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. మృతదేహాన్ని దర్శనార్థం ఉంచడంతో పలువురు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సైతం పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దౌండియాల్ అమర్ రహే, వందేమాతరం నినాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. ఈ వీరుడి అంతిమయాత్రకు వేలాది మంది విచ్చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల నుంచి సైతం వేలాది మంది కన్నీటితో ఈ యువ అధికారికి వీడ్కోలు పలికారు. దౌండియాల్‌తో పాటు శనివారం విధి నిర్వహణలో అసువులు బాసిన మేజర్ చిత్రేష్ బిష్త్ కూడా డెహ్రాడూన్‌కు చెందిన వారే. వీరిద్దరి మృతికి మంత్రి సత్‌పాల్ మహారాజ్, మాజీ ఎంపి తరుం విజయ్, అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్‌చంద్ అగ్రవాల్, బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి, డెహ్రాడూన్ మేయర్ సునీల్ ఉనియల్ గామా తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

చిత్రం.. పుల్వామా దాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ శంకర్ దౌండియాల్‌కు నివాళులు అర్పిస్తున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్