జాతీయ వార్తలు

మూడో దశ పోలింగ్ రేపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: సార్వత్రిక ఎన్నికల మూడో దశ ప్రచారానికి ఆదివారంతో తెరపడింది. మంగళవారం జరగబోయే పోలింగ్‌లో ఎంతో మంది హేమాహేమీల భవిష్యత్తు తేలనుంది. భారత రాజకీయాల్లో భీష్మపితామహుడు లాంటి సీనియర్ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ ఇంత కాలం ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కేరళలోని వాయనాడ్ నుండి లోక్‌సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు మూడో దశ పోలింగ్ బరిలోకి ఉన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే కర్నాటకలోని బీజాపూర్ నుంచి, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నాయకురాలు మహబూబా ముఫ్తి అనంతనాగ్ నుండి పోటీలో ఉన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన సినీనటి జయప్రద ఉత్తర ప్రదేశ్‌లోని రాంనగర్ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్‌తో తలపడుతున్నారు. పదిహేడవ లోక్‌సభ మూడో దశ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగియగా, మంగళవారం పదమూడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొదటి దశ ఎన్నికల్లో 91, రెండో దశ ఎన్నికల్లో 95 కలిపి ఇంత వరకు రెండు దశల్లో 186 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసి అభ్యర్థుల అదృష్టం ఈవీఎంలలో నక్షిప్తమై ఉంది. మంగళవారం నాటి మూడో దశ కింద 116 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన అనంతరం మొత్తం 302 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. మూడో దశ కింద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లోని మొత్తం ఇరవై ఆరు లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే రోజు పోలింగ్ జరుగుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గుజరాత్‌లోని 26కు 26 సీట్లు గెలుచుకోవటం తెలిసిందే. ఇప్పుడు మారిన పరిస్థితిలో ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? గుజరాత్ ప్రజలు నరేంద్ర మోదీకి ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడకతప్పదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పోటీ చేస్తున్న వాయనాడ్‌తోపాటు కేరళోని మొత్తం ఇరవై లోక్‌సభ సీట్లకు కూడా మంగళవారం పోలింగ్ జరుగుతుంది. దాదాపు అరవై శాతం ముస్లిం, క్రైస్తవ మైనారిటీ ఓటర్లున్న వాయనాడ్‌లో రాహుల్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడి నుంచి ఆయన భారీ మేజారిటీతో విజయం సాధిస్తారని అంటున్నారు. గుజరాత్, కేరళతోపాటు అస్సాంలోని నాలుగు, బిహార్‌లోని ఐదు, చత్తీస్‌గఢ్‌లోని ఏడు, గోవాలోని రెండు, జమ్ముకాశ్మీర్ ఒకటి, కర్నాటకలోని మిగతా పద్నాలుగు సీట్లకు కూడా మంగళవారం పోలింగ్ జరుగుతుంది. కర్నాటకలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలకు రెండో దశలో ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. మహారాష్టల్రోని 14, ఒడిశ్శాలోని ఆరు, ఉత్తర ప్రదేశ్‌లోని మరో 10 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో ఐదు సీట్లు, దాదర్‌నగర్ హవేలీ ఒకటి, దామన్ దీయులోని ఒకటి చొప్పున లోక్‌సభ స్థానాలకు కూడా మంగళవారం పోలింగ్ జరుగుతుంది. దీనితో పాటు వాయిదా పడిన త్రిపుర లోకసభ సీటుకు కూడా ఎన్నిక జరుగుతుంది. మాజీ మంత్రి దేవేంద్రప్రసాద్ యాదవ్ (జంజర్‌పూర్), రంజీత్ రంజన్ (సుపౌల్), రాష్ట్రీయ జనతా దళ్ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ (మధేపురా), రాజేష్ రంజన్ యాదవ్ (మధేపురా), బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా (గాంధీనగర్), ప్రహ్లాద్ జోషి (్ధర్వాడ్), కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే (ఉత్తర కర్నాటక), ప్రేమ చంద్రన్ (కొల్లమ్), బర్తుృహరి మహతాబ్ (కటక్), బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా (పురి), ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ గాంధీ (పిల్బిత్) నుండి పోటీ చేస్తున్నారు. వీరిలో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో వచ్చేనెల 23న తేలుతుంది.