జాతీయ వార్తలు

అమిత్‌షా ర్యాలీకి బెంగాల్ ప్రభుత్వం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీకి మరోసారి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిరాకరించింది. జాధవ్‌పూర్‌లో నేడు అమిత్‌షా ఎన్నికల ర్యాలీ నిర్వహించాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆయనకు అనుమతి నిరాకరించింది. దీనిపై బీజేపీ త్రీవంగా మండిపడింది. తృణమూల్ కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యల పట్ల ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకుంటుందని, దీనిపై ఆందోళన చేస్తామని బీజేపీ ఎంపీ అనిల్ బాలుని తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం నుంచి అమిత్‌షాకే కాదు బీజేపీ నాయకులకు సైతం ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించటమే కాకుండా, హెలికాఫ్టర్ల ల్యాండింగ్ సైతం అనుమతించకపోవటం గమనార్హం.