జాతీయ వార్తలు

అధ్యక్షుడు అమిత్ షాయే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరి కొంతకాలం బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలు జరిగేంతవరకు అమిత్ షాను బీజేపీ అధ్యక్ష పదవిలో కొనసాగించాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర తదితర మూడు రాష్ట్రాల ఎన్నికలు అక్టోబర్, నవంబర్‌లో జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు కొత్త అధ్యక్షుడిని నియమించటం వలన ఎన్నికల పని దెబ్బతింటుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే అమిత్ షాను మరి కొంతకాలం అధ్యక్షుడిగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా శాసనసభ ఎన్నికలతోపాటు కర్నాటక శాసనసభ ఎన్నికలు కూడా జరిపే అవకాశాలున్నాయని అంటున్నారు. కర్నాటకలోని ప్రస్తుత జేడీయూ-కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోయే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరోసారి విజయం సాధించాలంటే అమిత్ షా మరికొంత కాలం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగటం మంచిదని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. పార్టీ ఈ నిర్ణయం తీసుకోగానే అమిత్ షా హోం శాఖ పనులతోపాటు పార్టీ పనులు కూడా చేయటం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు ప్రారంభించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు పకడ్బందీ వ్యూహాన్ని తయారుచేయాలని ఆయన ఈ రాష్ట్రాల సీనియర్ నాయకులను ఆదేశించినట్లు తెలిసింది. అమిత్ షాను పార్టీ అధ్యక్షుడిగా మరి కొంతకాలం కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నందుకే బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం జాబితాలో అమిత్ షాను పార్టీ అధ్యక్షుడిగా పేర్కొనటం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి.