వరంగల్

ప్రేమ జంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 14: ఒకరి ఒకరు ఇష్టపడి జీవితాంతం కలిసి ఉంటామని అనుకున్న ప్రేమజంటకు పెద్దలు అడ్డుపడడంతో క్రిమిసంహారక మందు త్రాగి తనువుచాలించిన సంఘటన ఆత్మకూరు మండలంలోని కోగిలివాయి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. స్థానికులు, సిఐ రవికుమార్ కథనం ప్రకారం కోగిలివాయి గ్రామానికి చెందిన జెంగిలి గణేష్ (23) పదవతరగతి పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన నానబోయిన రమ (20) నగరంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. రెండు సంవత్సరాలుగా గణేశ్, రమలు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ ఇరువురు కుటుంబాలలో పెద్దలు అడ్డుచెప్పడంతోపాటు రమకు పెళ్లి సంబందాలు చూస్తూ గురువారం పెళ్లి నిశ్చయం చేయడంతో తీవ్రంగా మనస్థాపం చెందిన ప్రేమికులు రాత్రి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి క్రిమి సంహారక మందు త్రాగి అక్కడి అక్కడే మృతి చెందారు. ఉదయానే్న రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లగా నిర్జీవంగా పడివున్న గణేశ్, రమలను చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. మృతుల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకోని దర్యాప్తు నిర్వహిస్తున్నమని సిఐ తెలిపారు.