జాతీయ వార్తలు

మహిళల ఆరోగ్యంపై దృష్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహిళల ఆరోగ్య స్థితిగతులపై ప్రత్యేకంగా దృష్టిసారించి మెరుగైన సేవలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తరిమికొట్టడంతో పాటు పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. బీజేపీ మహిళా ఎంపీలతో శుక్రవారం ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీకి గరిష్ట స్థాయిలో 41మంది మహిళా ఎంపీలు ఉన్న విషయం విదితమే. అయితే ప్రధాని మోదీతో శుక్రవారం జరిగిన సమావేశానికి 30మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ అత్యున్నత చట్టసభలోకి అడుగుపెట్టిన మీరంతా ఒక్కో వ్యవస్థకు ప్రతిరూపాలని కొనియాడారు. ప్రజలతో మమేకమయ్యే అద్భుతమైన నైపుణ్యం మహిళలుగా మీలో దాగివుందని అన్నారు. ఈ నైపుణ్యమే మిమ్మల్ని ప్రజలకు దగ్గరకు చేస్తుందని పేర్కొన్నారు. రాజకీయాలకన్నా సమాజసేవనే ప్రజలు ఎక్కువగా గుర్తిస్తారని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మహిళా ఎంపీలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను మోదీ ఓపిగ్గా విన్నారు. బీజేపీ తరపున గెలిచిన పార్లమెంటు సభ్యులను ఏడు విభాగాలుగా విభజించారు. వీరందరితో వరుసగా సమావేశమవుతున్న ప్రధాని మోదీ శుక్రవారం ఐదో విడతగా మహిళా ఎంపీలతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు ఓబీసీ, ఎస్‌సి, ఎస్‌టి, యువ ఎంపీలతో మోదీ సమావేశమయ్యారు. యువ ఎంపీల్లో గతంలో మంత్రులుగా పనిచేసినవారు కూడా ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభ నుంచి ఎన్నికైన సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని నేరుగా కలుసుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలను ఏర్పాటుచేశారు. నియోజకవర్గ సమస్యలను నేరుగా ప్రధానికి వివరించడంతో పాటు అందుకు సంబంధించి చర్చలు, ప్రత్యేకంగా పార్లమెంటుకు చెందిన అంశాలను చర్చించేందుకు ఈ సమావేశాలు తోడ్పడతాయనే ఆలోచనతో బీజేపీ అధినాయకత్వం ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశాలు కేవలం ప్రధాని మోదీతో పరిచయం వరకే పరిమితమని పార్టీ నాయకులు చెబుతున్నారు. శుక్రవారం నాటి సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు జే.పీ.నడ్డా కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. కాగా, 16వ లోక్‌సభ సమావేశాలు జరిగిన సమయంలో కూడా ప్రధాని మోదీ పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ప్రాధాన్యాలపై ఎంపీలకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆ విధానానే్న ప్రస్తుత 17వ లోక్‌సభలోనూ మోదీ అవలంబిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా 78మంది మహిళా ఎంపీలున్నారు. వీరిలో 41మంది బీజేపీ సభ్యులే.