జాతీయ వార్తలు

5వ నెంబర్ గది నుంచి టీడీపీ ఔట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: రాష్ట్రంలో ఘోరపరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి కేటాయించిన పార్లమెంటులోని ఐదో నంబర్ గదిని ఖాళీ చేయించేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం టీడీపీ కార్యాలయం ఐదో నంబర్ గదిలోనే ఉంది. 22 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులున్న ఆ గదిని తమ పార్టీకి కేటాయించాలంటూ వైసీపీ చేసిన విజ్ఞప్తిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించినట్లు తెలిసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఐదో నంబర్ గదిని ఖాళీ చేసి మూడో అంతస్తులో ఉన్న చిన్న గదిలోకి టీడీపీ తమ కార్యాలయంగా మార్చుకోవలసి ఉంటుంది. పార్లమెంటు ఆవరణలోని ఐదో నంబర్ గది దాదాపు 35 సంవత్సరాల నుండి తెలుగుదేశం అధీనంలో ఉన్నది. 1984లో ఎన్‌టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 30 లోక్‌సభ సీట్లు గెలుచుకోవటంతో ఐదో నంబర్ గదిని ఆ పార్టీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి అత్యధిక మంది లోక్‌సభ సభ్యులుండటం వల్లే గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఆ గదిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. అప్పటినుంచీ ఆ గది టీడీపీ కార్యాలయంగా కొనసాగుతోంది. 1989లో తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య రెండుకు పోడిపోయినా ఐదో నంబర్ గదిని కాపాడుకున్నారు. 2004లో టీడీపీ సభ్యుల సంఖ్య ఐదుకు పడిపోయినప్పడు కూడా అప్పటి టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రంనాయుడు, 2009 ఎన్నికల్లో టీడీపీ ఆరు సీట్లు మాత్రమే గెలిచినా నామా నాగేశ్వరరావు ఐదో నంబర్ గది తమ చేయి జారకుండా కాపాడుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య మూడుకు పడిపోవటం.. సుజనా చౌదరి, రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు, వెంకటేష్ బీజేపీలో చేరిపోవటంతో రాజ్యసభలో టీడీపీకి ఇద్దరు సభ్యులే మిగిలారు. దీనికితోడు రాష్ట్రంలో వైసీపీ ధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఖాళీ చేయవలసి వస్తోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి ఈ ఐదో నంబర్ గదికోసం గట్టిగా కృషి చేశారు. ఆయన బీజేపీ నాయకులను కలిసి ఐదోనంబర్ గదిని తమకు కేటాయించవలసిన అవసరం గురించి పలుమార్లు వివరించటంతో వైసీపీకి కేటాయించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ గది వైసీపీకి దక్కకుండా చూసేందుకు తెలుగుదేశం నాయకులు గట్టిగా ప్రయత్నించినా ఫలితం కనిపించటం లేదు. ఈ గది నుండి టీడీపీని పంపించివేయాలని బీజేపీ కూడా భావించటంతో విజయసాయి రెడ్డి యత్నాలు ఫలించాయి.