జాతీయ వార్తలు

రాష్ట్ర గవర్నర్‌గా బిస్వభూషణ్ హరిచందన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌క కొత్త గవర్నర్‌ను నియమించింది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బిస్వభూషణ్ హరిచందన్ (84) గవర్నర్‌గా నియమిస్తూ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్థానంలో హరిచందన్ నియమితులయ్యారు. ఒడిశా శాసన సభకు ఐదుసార్లు ఎన్నికైన హరిచందన్ బీజేపీ-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. హరిచందన్ 1971లో జనసంఘ్‌లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బిస్వభూషణ్ హరిచందన్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి సంబంధాలున్నాయి. హరిచందన్ నియామకంతో ఏపీలో గత పదేళ్ల నుండి కొనసాగుతున్న నరసింహన్ గవర్నర్‌గిరీకి తెరపడింది. ఇలావుండగా అనుసూయ ఊకే చత్తీస్‌గఢ్ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లేదా లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలంగాణ రాష్ట్ర ప్రసుత్త గవర్నర్ నరసింహన్ స్థానంలో నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.