జాతీయ వార్తలు

మీ డ్యూటీ మీరు చేయడం మంచిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 21: ‘మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయ డం మంచిదే..’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై వ్యంగ్యోక్తి విసిరారు. సోనబద్ర భూ వివాదంలో 10 మంది గిరిజనులు (గోండ్లు) మరణించగా, 28 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించాలని ప్రియాంక పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి బయలుదేరగా పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. దీంతో ఆమె మిర్జాపూర్ జిల్లాలోని, చునార్ టౌన్‌లోని ఓ అతిథి గృహానికి మృతుల కుటుంబాలను, బంధువులను పిలిపించుకుని వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇలాఉండగా ఆదివారం సోనబద్ర ప్రాంతాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. యోగి ఆ ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళిన వెంటనే ప్రియాంక స్పందించారు. ముఖ్యమంత్రి తన విధులు నిర్వహించడం మంచిదేనని అన్నారు. అయితే బాధిత కుటుంబాలను పరామర్శించాలని కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకేసిన తర్వాతే ముఖ్యమంత్రి యోగి కదిలారని ఆమె అన్నారు. ఏదైనప్పటికీ దీనిని తాను స్వాగతిస్తున్నానని ఆమె తెలిపారు. సోనబద్రలోని ఉంబా ప్రాంత ప్రజలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఉంబా ప్రాంత ప్రజలను ప్రభుత్వం తగు విధంగా ఆదుకుంటుందని తాను ఆశిస్తున్నానని ఆమె చెప్పారు. తమ పార్టీకి చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబాలకు చేయూతనందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు. గిరిజనులకు రక్షణ కల్పించాలని, ఆ భూములపై వారికి హక్కు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.