జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌సీపై ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) గురించి ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రయత్నించింది. ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో పేర్లు లేనివారిని విదేశీయులుగా ప్రకటించినట్టు అర్థం కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఎన్‌ఆర్‌సీలో పేర్లు లేనివారు అప్పీలు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొంది. అస్సాం నివాసితుల జాబితా అయిన ఎన్‌ఆర్‌సీని ఆగస్టు 31వ తేదీన ప్రకటించనున్నారు. ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో పేర్లు లేని వారు ఫారినర్స్ ట్రిబ్యునళ్ల (ఎఫ్‌టీలు)లో అప్పీలు చేసుకోవడానికి కాల పరిమితిని ప్రస్తుతం ఉన్న 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచడానికి నిబంధనలను సవరిస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫారినర్స్ యాక్ట్ 1946, ఫారినర్స్ (ట్రిబ్యునల్స్) ఆర్డర్ 1964లలోని నిబంధనల కింద ఫారినర్స్ ట్రిబ్యునళ్లకు మాత్రమే ఏ వ్యక్తినయినా విదేశీయుడిగా లేదా విదేశీయురాలిగా ప్రకటించే అధికారం ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ‘ఏ వ్యక్తి పేరునయినా ఎన్‌ఆర్‌సీలో చేర్చలేదంటే, దానర్థం ఆ వ్యక్తిని విదేశీయుడిగా లేదా విదేశీయురాలిగా ప్రకటించినట్టు కాదు’ అని హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది. ఎన్‌ఆర్‌సీలో పేర్లు లేనివారిలో అవసరమయిన వారికి ఫారినర్స్ ట్రిబ్యునళ్లలో అప్పీలు చేసుకోవడానికి న్యాయ సహాయం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.