జాతీయ వార్తలు

మా ఆశయం.. నవ భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారిస్, ఆగస్టు 23: నవ భారత నిర్మాణానికే ఇటీవల లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అవినీతి, ఆశ్రీతపక్షపాతం, ప్రజాధనం దుర్వినియోగం, ఉగ్రవాదాన్ని గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అణచివేయడ జరిగిందని మోదీ తెలిపారు. యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంతతికి చెందిన వారిని ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ తాము రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ట్రిపుల్ తలాఖ్‌తో ఎంతో బాధపడుతున్న వివాహిత ముస్లిం మహిళలను ఆదుకునేందుకు దానికి స్వస్తి పలికామని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చామని ఆయన తెలిపారు. 370-అధికరణ తాత్కాలికమేనని అన్నారని ఆయన చెబుతూ తాత్కాలికం అంటే 70 సంవత్సరాలా? అని ఆయన ప్రశ్నించారు. నవ్వాలో, ఏడ్వాలో తనకు అర్థం కావడం లేదన్నారు. మహాత్మా గాంధీ, గౌతం బుద్దుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి
ఎందరో మహానుభావులు జన్మించిన దేశం మనది అని అన్నారు. 130 కోట్ల మంది భారతీయులు ఉమ్మడి ప్రయత్నంతో అభివృద్ధి పథంలో నవ భారతం పరుగులు పెడుతున్నదని మోదీ అన్నారు. ఈ కారణంగానే ప్రజలు మళ్లీ తమకు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారని ఆయన తెలిపారు. ప్రజలు తమకు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వాన్ని నడపడానికే కాదని, తమ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జాతి నిర్మాణ బాధ్యతను తమకు అప్పగించారని అన్నారు. తాము ఎన్నో సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళుతున్నామని ఆయన చెప్పారు. అనేకానేక నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకుని వస్తున్నామని అన్నారు. వంద రోజుల మైలు రాయిని తాము ఇంకా దాటాల్సి ఉందని, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కార్యాచరణపై దృష్టి పెట్టామని మోదీ తెలిపారు. 2030 నాటికి పర్యావరణ నిరోధక మార్పులను సాధిస్తామన్నారు. దేశం పురోగతి సాధిస్తున్నదంటే అది మోదీ గొప్పతనం కాదని, దేశ ప్రజలు ఇచ్చిన తీర్పు అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సభికులు మోదీ ఉంటే ఏదైనా సాధ్యమేనంటూ నినాదాలు చేశారు. భారత్ పురోగతి అంటే ప్రజలు సుఖంగా జీవించడం, ఇంకా ప్రజలు తమకు ఇష్టమైన వ్యాపారాలను చేసుకోవడం అని ఆయన చెప్పారు. 2025 సంవత్సరంలోగా టీబీని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య బీమా పథకాన్ని చేపట్టామని ఆయన వివరించారు. నిరుపేద రైతులకు పెన్షన్, జల్ శక్తి మంత్రిని నియమించడం, భారత్-ఫ్రెంచ్‌ల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం వంటి అనేక కార్యక్రమాల గురించి ప్రధాని మోదీ ఉటంకించారు.
ఇలాఉండగా ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంను సీబీఐ పోలీసులు అరెస్టు చేయడం, ఈ సమయంలో మోదీ ఇక్కడ అవినీతిని రూపుమాపుతున్నామని ఉద్ఘాటించడం గమనార్హం. కాగా కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో వేధిస్తున్నదని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.