హైదరాబాద్

ఔత్సాహిక కవులను ప్రొత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ఔత్సాహిక కవులను ప్రొత్సహించాలని నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు అన్నారు. 3వ జాతీయ స్థాయి వచన కవితల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం బండికల్లు వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బైస దేవదాసు విజేతలను బహుమతులను ప్రదానం చేశారు. బండికల్లు వెంటేశ్వర్లు మెమెరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువ కవులను ప్రొత్సహించేందుకు జాతీయ స్థాయిలో కవితల పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సాహితీ కిరణం మాస పత్రిక సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో జీవీ ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ చైర్మెన్ గుదిబండి వెంకట రెడ్డి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ రచయిత పెద్దూరి వెంకటదాసు, సినీ గేయ రచయిత మల్లిక్, సంస్థ అధ్యక్షుడు బండికల్లు జమదగ్ని, కార్యదర్శి బండికల్లు శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న రమ్య ఆరంగేట్ర ప్రదర్శన
కాచిగూడ, సెప్టెంబర్ 15: ప్రముఖ నృత్య కళాకారిణి రమ్య సబ్రమణియన్ భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన శంకరనంద కళాక్షేత్ర ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌కీ జోషి పాల్గొని కళాకారిణి రమ్య సుబ్రమణియన్‌ను అభినందించి సత్కరించారు. సంప్రదాయ భారతీయ కళల మాదిరే భరత నాట్యం ఒక కళ మాత్రమే కాకుండా అదోక తపస్సు లాటిందని అన్నారు. కళాకారిణి తనను తాను జయించడమే కాకుండా ప్రజల హృదయాలను గెలుచుకోవాలని అకాక్షించారు. రమ్య గత పది సంవత్సరాలుగా ఎంతో పట్టుదలతో భరతనాట్యం నేర్చుకుంటూ ప్రతిభ కనబరిచారని తెలిపారు. మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించి మంచి పేరు ఖ్యాతి సంపాధించుకోవాలని అన్నారు. రమ్య సుబ్రమణియన్ ప్రదర్శించిన ‘పుష్పాంజలి, అలరింపు, భారత్ వందన, వర్ణం, తిల్లానా’ తదితర అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంస్థ డైరెక్టర్ డా. ఆనంద శేఖర్ జయంత్, చిత్ర విశే్వశ్వరన్ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ‘బుర్రకథ సప్తాహం’
కాచిగూడ, సెప్టెంబర్ 15: శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుర్రకథ సప్తాహం ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. గానసభ ఆధ్వర్యంలో ప్రాచీన కళలు, కళాకారులను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం చేయాలేని పని కళా జనార్దన మూర్తి చేస్తున్నారని కొనియాడారు. బుర్రకథ కళాకారుడు ఆకుల శ్రీనివాస్ బృందం ప్రదర్శించిన ‘వీరబ్రహ్మం చరిత్ర’ ఆకట్టుకుంది. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, కళ పత్రిక సంపాదకుడు మహ్మద్ రఫీ, గానసభ కమిటి సభ్యురాలు గుండవరపు గీతాదేవి పాల్గొన్నారు.