జాతీయ వార్తలు
కాంగ్రెస్ నమ్మదగిన పార్టీ కాదు:మాయావతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 September 2019
న్యూఢిల్లీ: రాజస్థాన్లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటంపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో ఆమె కాంగ్రెస్ను తూర్పారాబట్టారు. కాంగ్రెస్ నమ్మదగిన పార్టీ కాదని, విశ్వాసఘాతుకానికి పాల్పడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలపై సమర్థవంతంగా పోరాడకుండా తనకు మద్దతునిచ్చిన పార్టీలను నష్టపరుస్తూనే ఉందని అన్నారు. రాజస్థాన్లో తాము బేషరతుగా మద్దతు ఇస్తే విశ్వాసఘాతుకానికి పాల్పడిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కులను కాలరాస్తుందని విమర్శించారు.