హైదరాబాద్

ఎంసీఈఎంఈలో కన్నుల పండువగా టెక్నికల్ ఎంట్రీ పాసింగ్ ఔట్ పరేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాకరమైన ఎంసీఈఎంఈలో విద్యను అభ్యసించిన టెక్నిలక్ ఎంట్రీ కేడెట్లు దేశానికి త్యాగనిరతితో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని మేజర్ జనరల్ టీఎస్‌ఏ నారాయణ్ పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఎంఎస్‌ఈఎంఈ టెక్నికల్ ఎంట్రీ కోర్సును పూర్తి చేసిన కేడెట్ల 34వ పాసింగ్ ఔట్ పరేడ్ ఉత్సవం జరిగింది. 28 మంది యువ కేడెట్లు ఈ కోర్సును జయప్రదంగా పూర్తి చేశారు. కఠినమైన మిలిటరీ, సాంకేతిక విద్యలో వీరు శిక్షణ పొందారు. ప్రతిభను కనపరచిన కేడెట్లకు బంగారు, రజత పతకాలను ప్రదానం చేశారు. ప్లాటూన్ బానర్‌ను చంద్రగుప్త ప్లాటూన్‌కు ప్రదానం శారు. మేజరల్ జనరల్ నారాయణ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయని అన్నారు. గురుతర బాధ్యతతో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. జాతి గర్వించదగిన కేడెట్లుగా పేరు తెచ్చుకోవాలని కోరారు.