జాతీయ వార్తలు

పరిస్థితి ‘మరింత మెరుగైతే’ ఇంటర్నెట్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 4: జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి ‘మరింతగా మెరుగుపడిన’ వెంటనే ఇంటర్‌నెట్ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము బుధవారం స్పష్టం చేశారు. అయితే, రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసినప్పటి నుంచి ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో ‘ఎప్పటికి ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరిస్తారో నిర్ణీత గడువును స్పష్టం చేయకపోవడం’ గమనార్హం. ‘యావత్ కాశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్నెట్‌పై ఉన్న ఆంక్షలపై మేం సమీక్షిస్తున్నాం.. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాం.. మరింత సాధారణ స్థాయికి వచ్చిన వెంటనే వీటిని అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకొంటాం.. ఇప్పటికే స్థానిక అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నాం.. దశల వారీగా ఆంక్షలను సడలించే ప్రయత్నం చేస్తాం’ అని ఎల్‌టీ ముర్ము బుధవారం విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. పోలీసు నియామకాల నేపథ్యంలో ఉత్తర కాశ్మీర్‌లో బారాముల్లా జిల్లా షీరిలోని స్థానిక పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం గవర్నర్ మాట్లాడారు. 370 అధికరణ రద్దు అనంతరం కాశ్మీర్‌లో పరిస్థితి ‘చాలా బాగుంది’ అని స్పష్టం చేశారు. రోజు రోజుకు మరింతగా మెరుగుపడుతూ వస్తోందని అని చెప్పారు. ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకొంటున్నారు.. రాష్ట్ర అభివృద్ధికి తమవంతుగా భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని ఎల్‌టీ ముర్ము తెలియజేశారు.