జాతీయ వార్తలు

ధన ప్రవాహం అడ్డుకునేందుకు కఠిన చట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: దేశంలో ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు మరింత కఠిన చట్టాలు రావల్సి ఉందని , ప్రజలే చొరవ తీసుకుని ధనప్రవాహాన్ని అడ్డుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఫౌండేషన్ ఫర్ డెముక్రటిక్ రిఫార్మ్స్, భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ , యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ సంస్థలు ‘రాజకీయాల్లో ధనప్రభావం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఉప రాష్ట్రపతి మాట్లాడారు. ప్రజాస్వామ్య రాజకీయాల విశ్వసనీయతను దెబ్బతీస్తున్న ధన ప్రభావంపై ఉపరాష్ట్రపతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఈ దిశగా అందరూ ఆలోచించాలి, అవసరమైన చట్టాలను అమలులోకి తీసుకురావాలి అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి ఇటు ప్రభుత్వాలు, అటు రాజకీయపార్టీలూ రెండూ విపరీతంగా నిధులను వెచ్చిస్తున్నాయని అన్నారు. డబ్బును అపరిమితంగా ఉపయోగించడం వల్ల కలిగే కారణాలపైనా, పర్యావసానాలపైనా ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. నిజాయితీ ఉన్న వారు, అర్హులైన వారు తక్కువ ఆదాయం ఉన్న వారి కంటే బాగా ధనవంతులే ఎంపీలుగా, ఎంఎల్‌ఏలుగా ఎన్నికవుతున్నారని ప్రస్తత లోక్‌సభలో 533 మంది సభ్యుల్లో 475 మంది సభ్యుల ఆస్తులు అనేక కోట్లలో ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో గాడితప్పుతున్న రెండు అంశాలను అత్యవసరంగా సరిదిద్దాల్సి ఉందని ఉప రాష్ట్రపతి చెబుతూ ఎన్నికల్లో రాజకీయాల్లో లెక్కకు మిక్కిలిగా వాడుతున్న ధనాన్ని అడ్డుకోవల్సి ఉందని అన్నారు. తాత్కాలిక ప్రయోజనాలను కల్పించి ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్నాయని, వాటికి బదులు ప్రజల కనీస అవసరాలు మరీ ముఖ్యంగా వౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, ప్రామాణిక విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రలోభాలకు అడ్డుకట్టవేయాలని అన్నారు. క్రమబద్ధీకరించని అధిక ఎన్నికల ఖర్చు అవినీతిని ప్రోత్సహిస్తుందని, ఎన్నికల ప్రక్రియ సరసతను అణగదొక్కడంతో పాటు రాజీపడే విధాన రూపకల్పన, పరిపాలన ద్వారా పాలనా నాణ్యతను దెబ్బతీస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజకీయపార్టీలకు నిధులు, వ్యయం, శిక్షణ, ఆధునికీకరణ, రాజకీయ కార్యకలాపాలు, ఎన్నికల వ్యయానికి సంబంధించి చాలా కఠినమైన ప్రవర్తనా నియమావళి ఉండాలని ఉప రాష్ట్రపతి పేర్కొంటూ సమర్ధులైన వారు ఎన్నికల్లోకి రాకుండా ధనవంతులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాల పారదర్శకతకు ఆర్ధిక జవాబుదారీతనాన్ని పాటించడంలో సిగ్గుపడాల్సిన పనే్లదని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీలకు పారదర్శకత ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు తమ ఖాతాల వివరాలను బహిరంగ పరిచేలా, పారదర్శకతను పాటించేలా నిర్ధారించే ఒక చట్టాన్ని రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని వెంకయ్యనాయుడు చెప్పారు. క్రమం తప్పకుండా రాజకీయ పార్టీల ఆస్తుల ఆడిట్ జరగాలని అన్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజాదరణ పొందిన పథకాల రూపంలో ప్రభుత్వాలు అందించే స్వల్పకాలిక ప్రయోజనాలు పేదలు, మధ్యతరగతి ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పారు. స్వల్పకాలిక ఆదాయ వృద్ధి, దీర్ఘకాలిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన లక్ష్యాల మధ్య సహేతుక సమతుల్యతను కనుగొనడానికి యంత్రాంగాన్ని రూపొందించాలని ఆర్ధిక వేత్తలు, సామాజిక శాస్తవ్రేత్తలు , మీడియా, పౌరసమాజం ముందుకు రావాలని కోరారు. బహుశా ద్రవ్యలోటును ఎపుడూ కప్పిపుచ్చే ఎఫ్‌ఆర్‌బీఎంకు సంబంధించి స్పష్టమైన చట్టం ఒకటి రావల్సి ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఫౌండేషన్ ఫర్ డెముక్రటిక్ రిఫార్మ్సు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రతినిధులు ఉన్నారు.
'చిత్రం... రాజకీయాల్లో ధన ప్రభావంపై ఐఎస్‌బీలో జరిగిన కార్యక్రమంలో సావనీర్ ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రతినిధులు