జాతీయ వార్తలు

రాజ్యసభకు ప్రియాంక ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చత్తీస్‌గడ్ లేదా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రియాంకను రాజ్యసభకు పంపించే అంశం ప్రస్తుతం సోనియా పరిశీలనలో ఉన్నదని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ ఆమోదించే పక్షంలో ప్రియాంక చత్తీస్‌గడ్ నుంచి రాజ్యసభకు వెళతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రియాంకను రాజ్యసభకు పంపిస్తే ఆమెను దొడ్డిదారిన పార్లమెంటుకు తెచ్చారం టూ బీజేపీ ప్రచారం
చేసే ప్రమాదం ఉన్నదని కొందరు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో విఫలమైనట్లు ప్రియాంక రాజ్యసభలో విఫలమైతే కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగాటే మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియాను రాజ్యసభకు తెచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం 17 రాష్ట్రాలలోని 55 సీట్లకు మార్చి 26న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.