జాతీయ వార్తలు

మైత్రి కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి తీసుకునిపోవాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో హైదరాబాద్ హౌజ్‌లో పలు అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరిపిన అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. రెండు దేశాల మధ్య కీలక భాగస్వామ్యం మరింత పెరిగేందుకు భారత్-అమెరికా మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాలు, పెరిగిన సహకారం నిదర్శమని ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను జవాబుదారి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయని ప్రధాని మోదీ మంత్రి చెప్పారు. భారత్-అమెరికా దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక అనుబంధానికి ప్రజల మధ్య ఉన్న సంబంధాలే పునాదులని ప్రధాని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో భారత పర్యటనకు రావడం గొప్ప విషయమని ఆయన చెప్పారు. డొనాల్డ్ ట్రంప్‌కు నిన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్ మొటెరా మైదానంలో ఇచ్చిన ఘన స్వాగతం చారిత్రాత్మకమైందని ఇది చిరకాలం నిలిచిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కేవలం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలు కావని, అవి ప్రజల వలన ప్రజల కోసం
ఏర్పడినవని నరేంద్ర మోదీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక అనుబంధం 21వ శతాబ్దంలో సంభవించిన అత్యంత ముఖ్య పరిణామమని మోదీ చెప్పారు. ఈ కారణం చేతనే రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర ప్రపంచ స్థాయి కీలక భాగస్వామ్యం దశకు తీసుకునిపోవాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర నిర్వహించటం వల్లనే ఇది సాధ్యమైందని నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, భద్రత, ఇంధనం, సాంకేతిక తదితర రంగాల్లో సహాయ, సహకారాలు ఇచ్చిపుచ్చుకునే అంశంపై లోతుగా చర్చించామని నరేంద్ర మోదీ వెల్లడించారు. అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాల కొనుగోలు మూలంగా మన సైనిక బలం ఎంతో పటిష్టం అవుతుందని ప్రధాని మోదీ వివరించారు. ప్రస్తుతం మన సైనికులు అత్యధిక సైనిక శిక్షణ అమెరికా సైనికులతో కలిసి తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో రెండు దేశాల సైన్యాల మధ్య సహాయ, సహకారాలు బాగా పెరిగాయని ఆయన చెప్పారు. అంతర్గత భద్రత, అంతర్జాతీయ స్థాయి నేరాల అదుపు విషయంలో రెండు దేశాల మధ్య మంచి ఒప్పందం కుదిరిందని మోదీ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిని జవాబుదారి చేయాలనే అంశంపై రెండు దేశాలు స్పష్టమైన అవగాహనకు వచ్చాయన్నారు. మాదక ద్రవ్యాల అదుపు అంశంపై కూడా రెండు దేశాల మధ్య ఒక అవగాహన కుదిరిందని మోదీ చెప్పారు. ఇంధన రంగంలో కుదిరిన ఒప్పందం అత్యంత కీలకమంటూ ఈ రంగంలో రెండు దేశాల పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. చమురు, సహజవాయువు సరఫరా విషయంలో అమెరికా మనకు అత్యంత ముఖ్యమైన వనరుగా మారుతోందంటూ గత నాలుగు సంవత్సరాల్లో చమురుకు సంబంధించి రెండు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది అని ప్రధాని మోదీ వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనం, అణు విద్యుత్ రంగంలో కూడా రెండు దేశాల మధ్య సహకారం బాగా పెరుగుతోందన్నారు. ఆధునిక సాంకేతిక రంగాలలో కూడా రెండు దేశాల మధ్య సహకారం పెరుగుతోంది, భారతీయ ప్రొఫెషనల్స్ ప్రతిభ అమెరికా కంపెనీల టెక్నాలజీ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేస్తోందని నరేంద్ర మోదీ చెప్పారు.
భారత్ అమెరికా దేశాలు ఆర్థిక రంగంలో కపటం లేని లావాదేవీలు, సరసమైన, సమతుల్యమైన వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయని ఆయన తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో ఇంధనం, పౌర విమానాలు, రక్షణ, ఉన్నత విద్యా రంగంలో రెండు దేశాల మధ్య 70 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయని మోదీ వివరించారు. అమెరికాలోని మన ప్రొఫెషనల్స్ సోషల్ సెక్యూరిటీ సహకారంపై టోటలైజేషన్ ఒప్పందం చేసుకోవాలని ట్రంప్‌ను కోరినట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు. ట్రంప్ పర్యటన మూలంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని మోదీ ప్రకటించారు.
*చిత్రం... సంయుక్త మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ