జాతీయ వార్తలు

మసూద్ అజార్ ఉగ్రవాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: ఉగ్రవాదాన్ని నిర్వచించే విషయంలో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేయనక్కర్లేదని చైనాకు భారత్ సూచించింది. జైషే ఉగ్రవాద సంస్థ చీఫ్ మహ్మద్ మసూద్ అజార్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై చైనాకు తమ నిరసన తెలిపినట్టు కేంద్రం లోక్‌సభకు తెలిపింది. జైషే చీఫ్ మసూద్‌ను ఐరాసా భద్రతా మండలి కమిటీ ఉగ్రవాదిగా పరిగణించకుండా చైనా తన వీటో అధికారంతో అడ్డుకుంటున్న నేపథ్యంలో మంగళవారం లోక్‌సభకు వివరణ ఇచ్చింది. కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి హరీభాయ్ ప్రతిభాయ్ చౌదరి సభలో ఓ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ‘మన వైఖరిని చైనాకు చాలా స్పష్టంగా చెప్పాం’ అని వెల్లడించారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చైనా దృష్టికి తీసుకెళ్లినట్టు సభకు తెలిపారు. గత నెల 18న చైనా పర్యటనకు వెళ్లిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యితో మాట్లాడారని హరీభాయ్ పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాద కార్యక్రమాల విషయంలో ద్వంద్వ వైఖరి, ఉండకూడదని చైనాకు స్పష్టం చేశాం’ అని ఆయన అన్నారు. ప్రపంచానికే పెనుసవాల్‌గా మారిన ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటం చేస్తోందని ఉద్ఘాటించారు.