సాహితి

చివరి ఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడైనా ఎవరికైనా
మరణం ఎలా రావాలంటే

పిలవగానే కువకువలాడుతూ
పెంపుడు పావురంలా
భుజం పైన వచ్చి వాలాలి

టికెట్టు కొనుక్కున్న రైలుబండిని
సకాలంలో అందుకున్నట్టు
నిదానంగా అన్నీ సర్దుకుని నింపాదిగా ఎక్కాలి

పూర్తిగా చదివేసిన పుస్తకాన్ని
జాగ్రత్తగా మడిచిపెట్టి మననం చేసుకున్నట్టు
మనస్ఫూర్తిగా మనశ్శాంతితో వెళ్ళిపోవాలి

నిస్సవ్వడిగా మట్టిలో ఇంకిపొయ్యే బిందువులా
మాగిపోయి మార్దవంగా నేలరాలే పండులా
కాలం ఒడిలోకి జర్రున జారిపోవాలి జీవం

వాయిద్యాలతో తరలివస్తున్న
దేవదేవుని పల్లకీకి ఎదురేగి
సమూహంలో కలిసిపోయినట్టు
కనుమరుగవ్వాలి ప్రాణం
నడచి వచ్చిన దారి మనం మరచిపోయినా
నలుదెసలా వెలిగే దారి దీపమేదో
నడవాల్సిన దారి చూపాలి

అనాయాసేన మరణం
వినాదైనే్యన జీవనం

కర్మలు జన్మలు ప్రారబ్దాలతో నిమిత్తం లేకుండా
సుఖంగా కడతేరిపోవాలన్న చివరాఖరి ఆశ
భూమీద పుట్టిన ప్రతి ఒక్కరికి నెరవేరాలి