శ్రీకాకుళం

‘పొయ్యి’ వెలగలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: విద్య జీవితంలో వెలుగులు నింపాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించేందుకు ‘విద్యాంజలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో గురుకుల పాఠశాలకు వచ్చే పిల్లలను ఈ నెల 20వ తేదీ వరకూ రావద్దంటూ హుకుం చేయడం గమనార్హం! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లలో విద్యాపరమైన పథకాలకు వందల కోట్ల రూ.లు కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయి స్థాయిలో ఫలితాలు అంతంతమాత్రంగానే కన్పిస్తున్నాయి. ఇటువంటి లోపాల వల్ల బాలికల విద్యాశాతం మెరుగుపడే అవకాశాలు లేకుండాపోతున్నాయి. అధ్యయనం చేయాల్సిన ఉన్నతాధికారులు విశ్రాంతి గదులకు పరిమితమై కాకులెక్కల నివేదికలు పాలకులను తప్పుతోవపట్టిస్తున్నాయి. బడి బయట ఉన్న బాలికలను బడిబాట పట్టించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ, సర్వశిక్షఅభియాన్, సాంఘిక సంక్షేమశాఖ, ఎస్సీ, బిసీ కార్పొరేషన్లు ఆధ్వర్యంలో వేలాది రెసిడెన్షియల్ స్కూళ్ళు పనిచేస్తున్నాయి. బాలికల విద్యను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వర్తించాల్సివున్నప్పటికీ, ఆ స్థాయిలో నిధులు కేటాయింపులు జరపకపోవడంతో బాలిక విద్య మిథ్యగా మారిందనడానికి తాజా పరిణామాలే తార్కణం. జిల్లాలో వందల కొద్ది గురుకులాలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు పునఃప్రారంభానికి ముందే పిల్లలకు కావల్సిన బియ్యం, కూరగాయలు, పాలు, గుడ్లు సరఫరాకు సంబంధించిన టెండర్లు అధికారులు ఖరారు చేయాల్సివుంది. కానీ, విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు రోజులు గడచినప్పటికీ, ఇంకా నిత్యావసర వస్తువులకు టెండర్లు ప్రక్రియ ఇంకా జరుగుతునే ఉంది. విద్యాలయాల్లోని పొయ్యల్లో పిల్లులు పడుకోవడంతో విద్యార్థులు ఆకలికేకలతో ఇంటిముఖం పడుతున్నారు. బుధవారం భామిని మండలంలో సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్‌కు వేసవి సెలవుల అనంతరం వచ్చిన బాలికలను 20వ తేదీ తర్వాత రమ్మంటూ తిరిగిపంపిన వైనమే ఇందుకు తార్కణం.
ఒక్కోక్క పాఠశాలలో ఐదో తరగతి నుంచి 10వ. తరగతి వరకూ సుమారు 200 మంది విద్యార్థినీలు హాజరుకావల్సివున్నప్పటికీ, కేవలం పదుల్లోనే హాజరైనప్పటికీ, వంట ప్రారంభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డి.సి.ఎం.ఎస్. ద్వారా నెలవారీ బియ్యం నిల్వలు సరఫరా చేయాల్సివున్నప్పటికీ నేటికీ ఒక గింజ కూడా పాఠశాలలకు సంబంధిత అధికారులు చేరవేయలేదు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేటు విద్యాసంస్థలు హవాను అడ్డుకుంటామని ఇటీవల బడిపిలుస్తోందంటూ ఉపాధ్యాయులను ఇంటింటికీ పంపినా సర్కార్ బడిబాట పట్టిన విద్యార్థినీవిద్యార్థులకు సాపాటు సమకూర్చాలన్న ముందుచూపు కొరవడింది. ఇక్కడ విధులు నిర్వహించిన కొంతమంది అధ్యాపకులకు కూడా ఏప్రిల్ నుంచి వేతనాలు ఇవ్వలేదంటూ ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. వీరంతా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తించడం వల్ల నోరుమెదపలేని పరిస్థితుల్లో ఉన్నారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ నుంచి జీతభత్యాలు, ఫుడ్ బిల్లులు చెల్లించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోక్క పాఠశాలలో తొమ్మిది మంది బోధకులు, పది మంది నాన్-టీచింగ్ సిబ్బంది చాలీచాలని జీతభత్యాలతో పనిచేస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులను ప్రశ్నించగా బడ్జెట్ లేదంటూ బదులిస్తున్నారు. అంతేకాకుండా, ఉన్నత విద్య పట్ల భరోసా ఇవ్వాల్సిన విద్యాలయాలపై చదువుల కోసం ఇక్కడ విద్యార్థినీలు దరఖాస్తు చేసుకున్న సాంఘికసంక్షేమ బాలికుల గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు లేవంటూ తిప్పిపంపేశారు. దీనిపై కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కౌనె్సలింగ్ అధికారులను నిలదీయగా కంచిలి మండలంలో కస్తురిబాగాంధీ పాఠశాలలో చదువుకున్న వారికి మాత్రమే అవకాశం ఉందని, ఆ పాఠశాలే సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉందని ఉన్నతాధికారులు సుస్పష్టం చేశారు. ఇలా విద్యావిధానాన్ని శాయశక్తులా భ్రష్టుపట్టించాక విద్యవల్ల ఇంకెక్కడి జాతీయాభివృద్ధి? ఇంకెక్కడి సామాజిక పరివర్తన?? అన్న ఆవేదన వ్యక్తమవుతోంది.