ఖమ్మం

అదుపుతప్పి కాల్వలో పడ్డ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి, జూన్ 24: మండల పరిధిలోని నాయకన్‌గూడెం సమీపంలో ఆర్టీసి బస్సు అదుపుతప్పి కాల్వలో బొల్తాపడిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మణుగూరు వెళ్తున్న మణుగూరు డిపో డీలక్స్ బస్సు నాయకన్‌గూడెం సమీపంలోని నాగార్జున సాగర్ కెనాల్‌లో ప్రమాదవశాత్తు అదుపు తప్పి పడటంతో ఓ బాబు అక్కడికక్కడేమృతి చెందగా, మరో 18మందికి గాయాలయ్యాయి. మృతుడు భార్గవ్ (16నెలలు) కాగా, భార్గవ్ తండ్రి కల్యాణ్ చక్రవర్తి, తల్లి శైలజకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఖమ్మం నగరంలో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు మైలవరపు రాంబాబు, జడ్చర్లకు చెందిన శైలజ, నర్సింహా, కిష్టప్ప చిన్నప్ప, నాగోలు, ఖమ్మంకు చెందిన కృష్ణ, మధిరకు చెందిన చిలక ఉపేందర్, విష్ణువర్థన్, హైదరాబాద్‌కు చెందిన నర్సింహా, కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన నగేష్ తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా డ్రైవర్ నిద్రమత్తులో అజాగ్రత్తగా బస్సు నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తుండగా, డ్రైవర్ మాత్రం స్టీరింగ్ రాడ్ విరగటం, కాల్వ సమీపంలో మూలమలుపు ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని తెలిపాడు. సంఘటన స్థలాన్ని సిఐ కిరణ్‌కుమార్, ఎస్‌ఐ శ్రీ్ధర్, ట్రైనీ ఎస్‌ఐ ప్రవీణ్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.