జాతీయ వార్తలు

బెయిలా? జెయిలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనియా, రాహుల్ వైఖరిపై సస్పెన్స్
రెండు రోజుల సమయముందన్న ఆజాద్
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కోర్టులో హాజరయిన తరువాత బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారా? లేదా? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ గురువారం కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇంకా రెండు రోజుల సమయం ఉందని, అంటే నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని, తమ న్యాయవాదుల సలహా మేరకు నిర్ణయం ఉంటుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాంనబీ ఆజాద్ గురువారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో డిసెంబర్ 19న హాజరు కావాల్సిందిగా ఢిల్లీలోని ట్రయల్ కోర్టు సోనియా, రాహుల్‌లకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నాయకులు ఈ కేసునుంచి రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తున్నారని, అందువల్ల బెయిల్‌కోసం దరఖాస్తు చేయబోరని ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్ 19న బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారా? అని విలేఖరులు ప్రశ్నించగా, ఆజాద్ పైవిధంగా బదులిచ్చారు. బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులకు సంబంధించి దాఖలు చేసిన ప్రైవేటు క్రిమినల్ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. న్యాయ వ్యవస్థపైన, దేశంలోని అన్ని చట్టాలపైన కాంగ్రెస్ అధినేత్రి, ఉపాధ్యక్షులతో పాటు మొత్తం పార్టీ నాయకత్వానికి పూర్తి విశ్వాసముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూడా అయిన ఆజాద్ తెలిపారు.
ఈ కేసులో ‘మేము ఏమి చేయాల్సి ఉందో, ఏయే పనిముట్లను ఉపయోగించాల్సి ఉందో, అవన్నీ ఉపయోగిస్తాము’ అని ఆజాద్ విలేఖరులతో అన్నారు. అయితే ఇంతకు మించి దీనిపై వివరణ ఇవ్వలేదు. కాంగ్రెస్ అధినాయకత్వానికి సంఘీభావం తెలిపేందుకు డిసెంబర్ 19న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి తరలిరావాల్సిందిగా పార్టీ ఆదేశించినట్లు వచ్చిన వార్తలను ఆజాద్ తోసిపుచ్చారు. కార్యకర్తలను ఢిల్లీకి రావాల్సిందిగా ఎవరూ కోరలేదని ఆయన అన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే తేది డిసెంబర్ 23వరకు ఢిల్లీలోనే ఉండాల్సిందిగా పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఆదేశించినట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.