జాతీయ వార్తలు

అవినీతి అడ్డా డిడిసిఏ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

13ఏళ్ల పాలనలో భ్రష్టు పట్టించారు
అరుణ్ జైట్లీపై ఆప్ నాయకుల ధ్వజం
అసత్య ప్రచారాన్ని నమ్ముకున్న కేజ్రీవాల్
కేంద్ర మంత్రి ఎదురుదాడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తన విమర్శల స్థాయిని మరింత తీవ్రం చేసింది. జైట్లీ అధినేతగా ఉన్న 13 ఏళ్ల కాలంలో ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ) అవినీతికి అడ్డాగా మారిందని ఆప్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అయితే ఆప్, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని జైట్లీ ప్రత్యారోపణ చేశారు. జైట్లీ హయాంలో బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసి డిడిసిఏ నుంచి పెద్దమొత్తంలో నిధులను మళ్లించారని, దీంతోపాటు క్రికెట్ జట్టు ఎంపికసహా అనేక అంశాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆప్ నేతలు ఆరోపించారు. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చంద్ర మరికొంత మంది నాయకులతో కలిసి గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ క్రికెట్ అసోసియేషన్‌లో పెద్దమొత్తంలో జరిగిన అవినీతి, అక్రమాలకు జైట్లీ ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీరియస్ ఫ్రాడ్ ఇనె్వస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఒ), డిడిసిఏ అంతర్గత దర్యాప్తు కమిటీ, ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విచారణ కమిటీ నివేదికలను ఆయన ఉటంకించారు. ఈ అవినీతిపై దర్యాప్తు జరుపుతున్న కొన్ని సంస్థలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల నిష్పాక్షిక విచారణ కోసం జైట్లీని మంత్రి మండలి నుంచి తప్పించాలని ఆప్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు.
ఫిరోజ్ షా కోట్ల మైదానం ఆధునీకరణకోసం బడ్జెట్‌లో రూ.24 కోట్లు మంజూరు కాగా, అదనంగా రూ.90 కోట్లు వ్యయం చూపారని పేర్కొంటూ ఈ నిధులను డిడిసిఏ ఆఫీస్ బేరర్లు ఏర్పాటు చేసిన బోగస్ కంపెనీలకు తరలించారని ఆప్ నాయకులు ఆరోపించారు. డిడిసిఏ నుంచి నిధులు పొందిన అయిదు కంపెనీల చిరునామాలు ఒకటేనని, వాటి డైరెక్టర్లు కూడా ఒకరేనని వారు వివరించారు. ఎలాంటి పనులు చేయని బోగస్ కంపెనీలకు జైట్లీ నేతృత్వంలోని డిడిసిఏ చెల్లింపులు జరిపిందని వారు వెల్లడించారు. డిడిసిఏలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాల్సిందిగా బిజెపి ఎంపి, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా కోరిన విషయాన్ని వారు గుర్తుచేశారు.
అయితే జైట్లీ మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎదురుదాడికి దిగారు. కేజ్రీవాల్ అసత్యాలను, అప్రతిష్టపాలు చేయడాన్ని, హిస్టీరియా వ్యాధి సోకినవారిలా మాట్లాడడాన్ని నమ్ముకున్నట్లు కనపడుతోందని జైట్లీ ప్రత్యారోపణలు చేశారు. కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వడాన్ని మానుకోవాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ సిఎం నితీశ్ కుమార్‌కు ఆయన హితవు పలికారు. 2013లోనే తాను డిడిసిఏ నుంచి బయటకు వచ్చానని, అందువల్ల 2014, 2015ల్లో జరిగిన కొన్ని వాస్తవాలను ప్రస్తావించడం ద్వారా కేజ్రీవాల్ తనను డిడిసిఏ కేసులో ఇరికించలేరని వ్యాఖ్యానించారు.