హైదరాబాద్

అమ్మా..చల్లంగ చూడమ్మా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట, జూలై 24: ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం లష్కర్ బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో తెల్లవారుఝామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరాష్ట్రం, స్వపరిపాలనలో మూడో సారి లష్కర్ బోనాల జాతర మరో సారి ఘనంగా జరిగింది. నగరంలో మారణకాండ సృష్టించేందుకు కుట్ర చేసి జాతీయ దర్యాప్తు సంస్థకు ఉగ్రవాదులు పట్టుబడిన నేపథ్యంలో సికిందరాబాద్ బోనాలు ప్రశాంతంగా, ఆనందోత్సవాలకు ప్రతీకగా జరిగేందుకు పోలీసులు రచించిన బందోబస్తు వ్యూహం ఫలించింది. జంటనగరాలకు చెందిన వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు ఇరుగుపొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. చిన్నాపెద్ద తారతమ్య లేకుండా ప్రతి ఒక్కరూ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చీకటి పడే సమయానికి రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య కళ్లు మిరుమిట్లు గొలిపే వర్ణాలతో, డప్పు వాయిద్యాలతో ఫలహారం బండ్ల ఊరేగింపులు ప్రశాంతంగా, చూడముచ్చటగా కొనసాగాయి. పలు చోట్ల మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్ స్టెప్పులేసి అభిమానులను, భక్తులు ఆకట్టుకున్నారు. ఉదయం అమ్మవారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలని, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు సిఎం తెలిపారు. వీరితో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, ఎంఎస్.ప్రభాకార్, సుధీర్‌రెడ్డి, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ. టిడిపి నేతలు పెద్దిరెడ్డి, ఎపి శాసన మండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు నందిఎల్లయ్య, మాజీ ఎంపి అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రిశశిధర్‌రెడ్డి, దానం నాగేందర్ తదితరులు అమ్మవారిని కొలిచారు. మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ దేవాలయం ఆవరణలోనే తిష్టవేసి ఎప్పటికపుడు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాట్లను సమీక్షించారు. ఉదయం పది గంటల నుంచి సికిందరాబాద్ పరిసర ప్రాంతాలకు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అమ్మవారికి బోనాలు, తొటెలు, టెంకాయలు సమర్పించుకుని తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఉత్సవాలు ఆనందోత్సవాలకు ప్రతీకగా, ప్రశాంతగా జరిగేందుకు వీలుగా పోలీసులు అడుగడుగునా నిఘాను ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా కన్పించిన వ్యక్తులు కదలికలను గమనించేందుకు ప్రత్యేకంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు చారిత్రాత్మకమైన దేవాలయాల ఆవరణలో పోలీసులు బోనాలు ఊరేగింపుగా వచ్చే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. అంతేగాక, మరోవర్గానికి చెందిన ప్రార్థన మందిరాల వద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేపట్టారు.