జాతీయ వార్తలు

నీట్ బిల్లుకు రాష్టప్రతి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: వైద్య విద్యకు సంబందించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(నీట్)కు రాష్టప్రతి ఆమోద ముద్ర వేశారు. ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన రెండు బిల్లులకు ఇటీవలే పార్లమెంటు ఆమోదించింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్(సవరణ) చట్టం 2016, అలాగే డెంటిస్ట్(సవరణ) చట్టం 2016 బిల్లులపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సంతం చేశారని అధికారులు వెల్లడించారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల్లో పారదర్శకత, అవినీతికి చోటులేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో నీట్‌ను తీసుకొచ్చారు. ఆగస్టు 1న రాజ్యసభ దీనికి సంబంధించి బిల్లును ఆమోదించింది. అంతకు ముందే గత నెలలో లోక్‌సభ ఆమోదించి పెద్దల సభకు పంపింది. దేశంలోని అన్ని వైద్య కళాశాలలు, డెంటల్ కళాశాలల్లో నీట్‌ను ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిల్లోనే నీట్ ప్రామాణికంగా తీసుకుంటారు. ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ ప్రవేశ పరీక్ష నిర్వహించేలా బిల్లుల్లో పొందుపరిచారు. వచ్చే విద్యా సంవత్సరం 2017-18 నుంచి దేశ వ్యాప్తంగా నీట్‌ను పూర్తిస్థాయిలో అమలుచేస్తారు.