జాతీయ వార్తలు

హోదా అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని అడిగే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. హోదా విషయంలో చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని, ఈ విషయంపై ఆయన ఒక్కసారి కూడా ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడలేదని ఆయన ధ్వజమెత్తారు. ఇంగ్లీష్‌లో మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమవుతుందని ముఖ్యమంత్రికి భయమన్నారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా సోమవారం సాయంత్రం పార్టీ ఎంపీలతో కలిసి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని జగన్ కలిశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి రాష్టప్రతి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించామని, మీరే న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించామని చెప్పారు. రాష్ట్రాన్ని విడగొడుతూ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చనపుడు,ప్రజాస్వామ్యంలో ఎవరిని అడగాలి? అని ప్రశ్నించారు. హోదా ఇవ్వకపోవడం ప్రధాని మోదీ తప్పని, హోదాకోసం కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం ముఖ్యమంత్రి తప్పని అన్నారు. ముఖ్యమంత్రికి దేవుడిపై భక్తి ఉందా అంటే అదీ లేదని, ఒకవైపు దేవుడి గుడులను కూల్చివేస్తూ మరోవైపు పుష్కరాలకు కేంద్ర మంత్రులను ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. విభజన హామీల అమలుపై అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని జగన్ చెప్పారు.

చిత్రం.. ఢిల్లీలో రాష్టప్రతికి వినతిపత్రం అందజేస్తున్న జగన్, పార్టీ ఎంపీలు