జాతీయ వార్తలు

బోనస్ బిల్లు ఆమోదంపై కేంద్రమంత్రి దత్తాత్రేయ హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: బోనస్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపటం పట్ల కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన బోనస్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వటం వల్లే ఈ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించిందని దత్తాత్రేయ చెప్పారు. బోనస్ పొందే వారి అర్హతను పదివేల రూపాయల వేతనం నుండి ఇరవైఒక్క వేల వేతనం వరకు పెంచామని ఆయన తెలిపారు. ఇరవై మంది కార్మికులు పనిచేసే ప్రైవేట్, పబ్లిక్ పరిశ్రమలకు కూడా ఇకమీదట బోనస్ చట్టం వర్తిస్తుందన్నారు. బోనస్ సవరణ 2014 నుండి అమలులోకి వస్తుందని దత్తాత్రేయ చెప్పారు. బోనస్ సవరణ చట్టం మూలంగా ప్రభుత్వంపై సాలీనా ఆరువేల కోట్ల రూపాయల భారం పడుతుంది. అయితే కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్టప్రతి ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో ఉన్నప్పటికీ బోనస్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించగానే ఆయన ఆమోదం తీసుకుని రాజ్యసభకు పంపటం జరిగిందని వివరించారు. కార్మిక రంగానికి ఎన్‌డిఏ ప్రభుత్వం చేసిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు.ఇదిలా ఉంటే బోనస్ సవరణ చట్టానికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలియజేయటంతో భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్మికులు పరస్పరం స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.