శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

న్యాయగ్రంథాలపై ఆసక్తితోనే న్యాయవాద వృత్తిలో విజయావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, డిసెంబర్ 26: న్యాయ గ్రంథాలను నిరంతరం చదువుతుంటే న్యాయవాద వృత్తిలో రాణించవచ్చని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ అన్నారు. నెల్లూరు బార్ అసోసియేషన్‌లో శనివారం ఆయన న్యాయ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు ఆర్‌ఆర్‌హెచ్ అంటే రెగ్యులర్ రీడింగ్ హేబిట్ అన్నది న్యాయవాదుల వృత్తిలో కీలకమైనదని అభిప్రాయపడ్డారు. బార్ అసోసియేషన్‌లో ప్రారంభించిన న్యాయ గ్రంథాలయాన్ని యువ న్యాయవాదులు ఉపయోగించుకుని వృత్తిలో విజయావకాశాలు అందుకోవాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లా జడ్జి సిహెచ్‌కె దుర్గారావు, బార్ ప్రెసిడెంట్ ఎం రామచంద్రారెడ్డి, బార్ జనరల్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు. ఈ సమావేశానికి పట్టణంలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. హైకోర్టు జడ్జిని బార్ అసోసియేషన్ కార్యవర్గం ఘనంగా సన్మానించారు.
ఎస్‌బిఐ బ్రాంచిని ప్రారంభించిన హైకోర్టు జడ్జి
జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిని హైకోర్టు జడ్జి ఎస్‌వి భట్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఇండియా జనరల్ మేనేజర్ హరికృష్ణ జన్, తదితర బ్యాంక్ అధికారులు, జిల్లా జడ్జి సిహెచ్‌కె దుర్గారావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్‌లో ఓఆర్ వాటర్‌ప్లాంట్‌ను కూడా హైకోర్టు జడ్జి ప్రారంభించారు. కాగా నూతనంగా ఎస్‌బిఐ బ్రాంచిని జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రారంభించటంతో పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీలో సభ్యుల తీరు బాధాకరం:ఆనం
రాపూరు, డిసెంబర్ 26: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రవర్తించిన తీరు బాధాకరమని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు నుండి రేణిగుంటకు వెళ్తూ రాపూరులో కొద్దిసేపు ఆగారు. ఆయన రాకను ముందుగా తెలుసుకున్న ఆనం అనుచరులు, కార్యకర్తలు పెద్దఎత్తున మద్దెలమడుగు నాలుగు రోడ్ల కూడలి వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎంతో విలువైన సమయాన్ని స్వార్ధాల కోసం, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసెంబ్లీ సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.