శ్రీకాకుళం

సమస్యల పరిష్కారానికి ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 26: జిల్లా కలెక్టర్ కార్యాలయం సోమవారం వివిధ వృత్తిదారులు, ప్రైవేట్ ఉద్యోగుల ధర్నాలతో, నినాదాలతో దద్దరిల్లిపోయింది. జిల్లా గొర్రెలు, మేకలు పెంపకం దార్ల సంఘం ఆధ్వర్యంలో జీవో నెం. 559, 1016లు తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. జెఎల్ గ్రూపులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని, వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత సీజనల్ వ్యాధుల దృష్ట్యా మూగజీవాలు రోగాల బారిన పడుతున్నాయని, ప్రభుత్వం ఉచితంగా మందులు సరఫరా చేయాలన్నారు. అలాగే నేషనల్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాకు వ్యవసాయ అనుబంధ రంగాలకు 14 కోట్ల రూ.లు నిధులు కేటాయించారని, ఆ నిధులు గొర్రెలు, మేకలు పెంపకం కూడా వ్యవసాయ అనుబంధమే కాబట్టి వీరికి వర్తింపజేయాలని అన్నారు. కార్యక్రమంలో సిటు నేత టి.తిరుపతిరావు, సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గంటా శ్రీరామ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.సాంభమూర్తి, పి.నందోడు, ఎం.కృష్ణమూర్తి, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
వేతనాలు అందక ఇక్కట్లు
రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(రిమ్స్)లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు ఐదు నెలలుగా వేతనాలు లేక నానా ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని సిటు నేత కె.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. నూతనంగా ఏజెన్సీ చేపట్టిన గుత్తేదారు సెక్యూరిటీ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడమే కాకుండా వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తక్షణమే వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డి.గణేష్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.